వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తలతోకలేని నిర్ణయాలపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే.. వీరు వైఎస్‌పై అభిమానంతో సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. అయితే.. ఈ దూకుడు మరింత దారుణంగా మారిపోవడంతో విసుగు చెందిన వారు.. పార్టీ నుంచి.. పదవుల నుంచి కూడా బయటకు వస్తున్నారు. తాజాగా కీలకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
వీరిలో కీలకమైన వ్యక్తి.. అన్నగారితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న ప్రముఖ రచయిత.. యార్లగడ్డ లక్ష్మీప్ర సాద్. అన్నగారు జీవించి ఉన్నన్నాళ్లు.. ఆయనకు వ్యక్తిగత సలహాదారుగా.. కూడా యార్లగడ్డ పనిచేశారు. అన్నగారి ప్రోత్సాహంతో అనేక కీలక విషయాల్లోనూ.. ఆయన సలహాలు ఇచ్చారు. అన్నగారి మరణం తర్వాత.. ఆయన కుటుంబంతో బంధం తగ్గించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. వైఎస్‌తో నూ అనుబంధం ఏర్పడింది.
ఇది కాలక్రమంలో వైసీపీకి కూడా మద్దతుగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అధికార భాషా సంఘానికి.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. చైర్మన్‌గా వ్యవహిస్తున్నారు. అయితే..ఇప్పటి వరకు సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదం అయినా.. ఆయన భరించారని.. యార్లగడ్డ సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా తెలుగు మీడియం తీసేయడం.. అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం చేయడంవంటివి.. ఆయనను ఇరకాటంలో పడేశాయి.
ఈక్రమంలో యార్లగడ్డపై ఒత్తిళ్లు కూడాపెరిగాయి. తెలుగు భాషాభిమాని అయిన.. యార్లగడ్డ.. తెలుగు కు వైసీపీ సర్కారు అన్యాయం చేస్తుంటే.. ఎలా చూస్తూ.. ఊరుకున్నారనే విమర్శలు పెల్లుబికాయి. అయినా.. ఆయన పంటిబిగువన భరించారు. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంతో ఆయనఇక, రాం రాం చెప్పేశారు. తన తెలుగు భాషా చైర్మన్.. పదవికి రాజీనామా చేసేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధగా ఉందని అన్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on September 21, 2022 12:38 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…