విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనమన్నారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
రామారావు మరణానంతరం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామని చంద్రబాబు చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని నీ తండ్రి వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదని జగన్‌పై నిప్పులు చెరిగారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమని బాబు అన్నారు.
మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతుం డడడం దురదృష్టకరమన్నారు. వర్సిటీ కి చెందిన 450 కోట్ల నిధులు సైతం బలవంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం….ఏ హక్కుతో పేరు మార్చుతుందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి…వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా? అని నిలదీశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉందన్నారు.
దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదన్నారు. వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుందని హితవు పలికారు. ఈ విషయాన్ని సిఎం జగన్ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. .
This post was last modified on September 21, 2022 10:59 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…