సంస్ధలకు, వ్యవస్థలకు పాలకులు తమ పేర్లు పెట్టుకోవటం మామూలైపోయింది. తమ హయాంలో ఏర్పాటుచేసిన వాటికి తమిష్టమొచ్చిన పేర్లు పెట్టుకోవటంలో తప్పులేదు. అంతేకానీ అంతకు ముందు ప్రభుత్వం పెట్టిన పేర్లను తీసేసి తమిష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవటం మాత్రం తీవ్ర అభ్యంతరకరమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటిగా పేరు మార్చటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలోని అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలు ఆయా యూనివర్సిటీల పరిధిలోనే ఉండేవి. వాటికి డిగ్రీలను కూడా ఆయా యూనివర్సిటీలే ప్రధానం చేసేవి. అయితే ఎన్టీయార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పద్దతుల్లో మెడికల్, డెంటల్ కాలేజీలన్నింటికీ కలిపి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీగా ఏర్పాటుచేయాలని అనుకున్నారు. అలా 1986లో మెడికల్, డెంటల్ కాలేజీలకు కలిపి ప్రత్యేకంగా ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటిని ఏర్పాటుచేశారు.
అప్పటినుండి 26 మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. 1998లో ఎన్టీయార్ మరణించిన తర్వాత యూనివర్సిటికి ప్రభుత్వం ఎన్టీయార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరుమార్చింది. అప్పటినుండి వైద్య విశ్వవిద్యాలయం ఎన్టీయార్ పేరుమీదే చెలామణి అవుతోంది. అలాంటి యూనివర్సిటికి ఎన్టీయార్ పేరును ఇపుడు డాక్టర్ వైఎస్సార్ పేరుకు మార్చాలని జగన్ ప్రభుత్వం ఆలోచించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
ఇక్కడే సమస్య మొదలైంది. ఎన్టీయార్ పేరును మార్చి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్ధలకో లేకపోతే వ్యవస్ధలకో జగన్ తనిష్టం వచ్చిన పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవైపేమో విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ జిల్లాగా పేరుపెట్టి మరోవైపు వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీయార్ పేరును తీసేయటంలో అర్ధమేంటి ? కాబట్టి పేరుమార్చే విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుంది.
This post was last modified on September 21, 2022 10:56 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…