అసెంబ్లీలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క అసెంబ్లీలోనే కాదు.. శాసన మండలిలోనూ.. టీడీపీ చాలా వరకు దూకుడుగానే ఉంది. నిజానికి అసెంబ్లీలో రెండు ప్రధాన ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఒకటి.. పార్టీకి నాయకుడు లేకపోవడం. అంటే.. పార్టీ అధినేత చంద్రబాబు.. సభకు రాకుండా.. దూరంగా ఉండడం ఒక పెద్ద మైనస్. రెండోది.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలే సభకు హాజరుకావడం.
దీంతో సాధారణంగానే టీడీపీ ఏం పుంజుకుంటుంది? ఎలా ముందుకుసాగుతుంది? అనే చర్చ జోరుగానే సాగింది. ఎందుకంటే.. కీలకమైన.. చంద్రబాబు లేనప్పుడు..సభలో పార్టీ సభ్యులు ఎలా దూకుడు ప్రదర్శిస్తారనే అంశం.. ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. చంద్రబాబు లేకున్నా.. ఆయన కనుసన్నల్లో నాయకులు దూకుడుగా ఉన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నుంచి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వరకు అందరూ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
బలమైన ప్రశ్నలు సంధించడంతోపాటు.. అధికార పార్టీ సభ్యులకు దీటుగా సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు. విషయాలపై కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా రాజీలేని పోరాటంతో చంద్రబాబు లేకపోయినా.. సభను ఆద్యంతం ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో గడిచిన మూడు రోజుల సభ.. కూడా టీడీపీ సభ్యులే పైచేయి సాధించారనే వాదన వినిపిస్తోంది. ఇక, నిత్యం సస్పెండ్ అవుతున్నా.. ప్రజలకు గట్టి వాయిస్‌ను అందిస్తున్నారనడంలో సందేహం లేదు.
ఇక, శాసన మండలిలోనూ.. టీడీపీ సభ్యులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎవరూ కూడా.. ఎక్కడా రాజీ పడడం లేదు. దీపక్‌రెడ్డి.. ఫరూక్.. నారా లోకేష్.. వంటివారు.. అధికార పక్షాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న అంశాలను కార్నర్ చేస్తూ..ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నేతల దూకుడుకు అంతే దూకుడుగా సమాధానం కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు సభల్లోనూ టీడీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 21, 2022 6:48 am
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…