ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు..ఉన్నత విద్యావంతుడు.. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్ పూటుగా మద్యం తాగారా.. ? నడవలేని స్థితిలో ఆయన విమానాశ్రయం చేరుకు న్నారా? విమానం ఎక్కేందుకు ప్రయత్నించారా? అయితే.. ఆయనను విమానంలోని సిబ్బంది.. దింపేశా రా? ఇదీ.. ఇప్పుడు.. పెద్ద ఎత్తున దేశంలో రేగిన కలకలం. అయితే.. ఇది నిజమేనని.. పంజాబ్ ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖబీర్ సింగ్ బాదల్ అంటున్నారు. భగవంత్ మాన్తోపాటు శనివారం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణి కులు ఈ విషయం చెప్పారంటూ సుఖబీర్ ట్వీట్ చేశారు.
“మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారు. దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైంది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయా రు. ఈ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బందిపడేలా చేశాయి. అయితే.. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చింది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి” అని బాదల్ ట్వీట్ చేశారు.
రాజీనామా చేయండి!
పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సైతం ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భగవంత్ మాన్ది తప్పని తేలితే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ దర్బార్ నడిపిస్తోందంటూ పరోక్షంగా కేజ్రీవాల్, రాఘవ్ చడ్ఢాలను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భగవంత్ మాన్పై చర్యలు తీసుకుంటారా లేదా అని కేజ్రీవాల్ను ప్రశ్నించారు.
ఆప్ ఖండన
ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. ఆదివారం భారత్కు తిరిగొచ్చారు. అయితే.. ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిని ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాల నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు మండిపడ్డాయి.
This post was last modified on September 19, 2022 9:38 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…