జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్న కేసీయార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా ? ఈ అవకాశమంటే ఈనెల 25వ తేదీన హర్యానాకు వెళ్ళటం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతి ఉత్సవాలను సమ్మాన్ దివన్ పేరుతో ఆయన వారసులు ఈనెల 25వ తేదీన హర్యానాలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని బారీఎత్తున నిర్వహించటంలో భాగంగా దేశంలోని చాలామంది ప్రతిపక్ష నేతలు, నాన్ బీజేపీ నేతలను పిలిచారు.
ఇందులో భాగంగానే కేసీయార్ కు కూడా ఆహ్వానం అందింది. కార్యక్రమానికి రావాలంటు శరద్ పవార్, మమతాబెనర్జీ, నితీష్ కుమార్, చంద్రబాబునాయుడు, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, తేజస్వీ యాదవ్, ప్రకాష్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ తదితరులను కూడా ఆహ్వానించారు. చంద్రబాబు, కాంగ్రెస్ నుండి నేతలు హాజరయ్యేది అనుమానమే అంటున్నారు. మరీ నేపధ్యంలో కేసీయార్ హాజరవుతారా ? కార్యక్రమాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా ? అనే చర్చ మొదలైంది.
నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలను ప్రస్తుతానికైతే నితీష్ కుమార్, కేసీయార్ మాత్రమే చేస్తున్నారు. మొదట్లో మమతా బెనర్జీ కూడా కాస్తహడావుడి చేసినా తర్వాత చప్పపడిపోయారు. ఇపుడు యాక్టివ్ గా ఉన్నది మాత్రం నితీష్ అండ్ కేసీయార్ మాత్రమే. ఇందులో కూడా కేసీయార్ మాత్రం నాన్ బీజేపీ పార్టీలను ఒకటిగా చేసి ఆ కూటమికి నాయకత్వం వహించాలనే ఆలోచనలో ఉన్నట్లున్నారు.
మరపుడు 25వ తేదీ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందే. ఎందుకంటే చాలామంది ప్రతిపక్షనేతలు కార్యక్రమానికి హాజరవుతారని అనుకుంటున్నారు. కాబట్టి అక్కడే వీలున్నంతమంది ప్రముఖులతో కేసీయార్ భేటీఅయితే వారినుండివచ్చే సానుకూలస్పందనేమిటో తెలుసుకోవచ్చు. దాని ప్రకారం తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకునే అవకాశం కేసీయార్ కు దక్కుతుంది. గతంలో ప్రతిపక్షాల నేతలతో ఢిల్లీలో మమతా బెనర్జీ కాన్సిట్యూటషనల్ క్లబ్ లో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కేసీయార్ వెళ్ళకుండా కేటీయార్ ను పంపారు. ప్రతిపక్షాల్లోని ప్రముఖులందరినీ కలిసే అవకాశాన్ని అప్పుడు మిస్సయారు. మరిపుడు ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on September 19, 2022 9:33 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…