Political News

Amit Shah: ఆపరేషన్‌ పోలో తో హైద‌రాబాద్ కు విముక్తి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. ఆధ్వ‌ర్యంలో.. తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్ వల్లే ఇదంతా సాధ్యమైందని అమిత్‌షా పేర్కొన్నారు.

హైదరాబాద్‌ విమోచనానికి పటేల్‌ విశేష కృషి చేశారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ కు రాలేదన్నారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు.. ఆపరేషన్‌ పోలో ద్వారా పటేల్‌ ముగింపు పలికారని అమిత్‌ షా కొనియాడారు. పటేల్ పోలీస్ యాక్షన్‌తో నిజాం సైన్యం తలవంచిందన్నారు. పటేల్‌ లేకపోతే హైదరాబాద్‌ విమోచనానికి మరింత సమయం పట్టేదని అమిత్ షా పేర్కొన్నారు.

విమోచన దినాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని అమిత్‌ షా పేర్కొన్నారు. విమోచన దినం జరిపేందుకు ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం సాహసించలేదన్నారు. తెలంగాణను పాలించిన పార్టీలన్నీ ఓటు బ్యాంకు కోసమే పనిచేశాయన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదన్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మోడీ ఆదేశించారని అమిత్‌ షా వెల్లడించారు.

విమోచన దినోత్సవాన్ని రాజకీయంగా వాడుకోవటం దుర్మార్గ చర్య అని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని అమిత్ షా ప్రశ్నించారు. `రాజ‌కీయ వాదుల స్వార్థానికి ఇప్ప‌టికీ.. తెలంగాణబలి అవుతూనే ఉంది. దీనిని ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం.. యువ‌త‌పై ఉంది. తెలంగాణ ఆశ‌లు.. ఆకాంక్ష‌లు నెర‌వేర్చే బాధ్య‌త‌ను బీజేపీ తీసుకుంది. అందుకే.. ఈ ఎనిమిదేళ్ల కాలంలో.. తెలంగాణ‌కు ఎంతో చేశాం అని షా చెప్పుకొచ్చారు.

This post was last modified on September 17, 2022 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

3 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

11 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

15 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

15 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

16 hours ago