రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేపంథాలో సాగవు. ఎవరు ఎవరికీ శాశ్వత శత్రువులు కారు.. ఎవరు ఎవరికీ శాశ్వత మిత్రులు కూడా కారు. ఒకప్పుడు.. తెలంగాణ వద్దన్న.. సీపీఎం.. కావాలన్న సీపీఐ.. ఈ రెండు పార్టీల విషయంలో చాలా ఏళ్లపాటు.. (KCR) (Telangana) సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. వాటిని సైతం దూరంగా ఉంచారు. అంతేకాదు.. కమ్యూనిస్టుల కంచుకోటను దెబ్బతీశారు కూడా! సాగర్ నుంచి గెలిచిన.. కామ్రెడ్ నోముల నరసింహయ్యను తనవైపు తిప్పుకొని.. రాజకీయం చేశారు.
దీంతో ఆ నాడు.. కమ్యూనిస్టులు.. కేసీఆర్‌ను మరో…నిజాం అంటూ.. సంబోధించారు. విమర్శించారు. అయితే.. ఇవన్నీ.. గత ముచ్చట్లు(నాలుగేళ్లు మాత్రమే అయినా). కానీ, ఇప్పుడు.. కేసీఆర్‌తో కమ్యూనిస్టు లు.. కమ్యూనిస్టులతో కేసీఆర్.. చేతులు కలపాల్చిన పరిస్థితి వచ్చింది. కేంద్రంలో చక్రం తిప్పుతానని చెబుతున్న గులాబీ బాస్.. కమ్యూనిస్టులను మచ్చిక చేసుకుంటే.. తప్ప జాతీయ స్థాయిలో చక్రం తిప్పలేనని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కట్ చేస్తే.. కమ్యూనిస్టులకు ఇప్పటికిప్పుడు కావాల్సింది ఏంటి.? అంటే.. జాతీయ స్థాయిలో వారికి నేతకాదు.. రాష్ట్రాల స్థాయిలో వారు నిలదొక్కుకునేందుకు బలమైన నాయకుడు. ఆ నాయకుడి కోసమే.. ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాల్లో కామ్రెడ్లు ఎదురు చూస్తున్నారు. గతంలో జనసేన వెంట పరుగులు పెట్టారు. 2019 ఎన్నికల్లో కలిసి కూడా పోటీ చేశారు. అయితే.. తర్వాత బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో వారు దూరమయ్యారు.
ఇక అప్పటి నుంచి కమ్యూనిస్టులు బలమైన కొమ్మకోసం.. ఎదరు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కేసీఆర్ వారికి కలిసివ చ్చిన నాయకుడుగా కనిపిస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 2 నుంచి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం కేసీఆర్‌ద్వారా వారికి లభించే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైతే.. బలంగా ఉన్నారో.. అక్కడ ఇప్పుడు కేసీఆర్ సాయం తీసుకుంటే.. ఏపీలోని 2 నుంచి మూడేం ఖర్మ 5 స్థానాల్లో కామ్రెడ్లు గెలిచే ఛాన్స్ ఉంటుందనిలెక్కలు వస్తున్నాయి.
ఇలా సాయం చేసేందుకు కేసీఆర్‌కు కూడా నష్టం లేదు. రాష్ట్రం తనది కాదు.. పైగా. జాతీయస్థాయిలో కామ్రెడ్లు ఆయనకు అండగా ఉండే ఛాన్స్ ఉంది.సో.. ఏదో ఒక రకంగా.. రెండు నుంచి మూడు స్థానాలను వారికి కట్టబెట్టేలా.. కేసీఆర్ చక్రంతిప్పినా.. తిప్పొచ్చని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 17, 2022 11:47 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…