ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు.. హడలి పోతున్నారట. తమ ప్రతిపాదనకు ఎక్కడ విముఖత వస్తుందో.. రేపు ఎక్కడ ఎలా వ్యవహరించినా.. తమకు బెడిసికొట్టే పరిస్థితి ఉందేమో.. అనివారు తర్జన భర్జన పడుతున్నారట. దీనికి కారణం.. ఏపీ రాజధాని రైతులు చేపట్టిన అమరావతి నుంచి అరసవల్లి యాత్రే నని.. పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. రాజధానిగా అమరావతే ఉండాలని.. ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది.
రైతులు చేపట్టిన రాజధాని ఉద్యమానికి కావొచ్చు.. హైకోర్టు చేసిన తీర్పు విషయంలో కానీ.. ప్రజలు సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. రైతులకు అడుగడుగునా.. హారతులు పట్టారు. హైకోర్టు తీర్పు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఈ పరిణామం.. వైసీపీకి మింగుడు పడడం లేదు. ఎందుకంటే.. ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని.. మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని.. వైసీపీ నాయకులు ఊరూ వాడా చెబుతున్నారు.
ఇది నిజమే అయితే.. మూడు ప్రాంతాల్లో.. ప్రజల నుంచే ఈ డిమాండ్లు వచ్చేవి. కానీ.. ఇప్పటి వరకు.. ఎలాంటి ప్రకటనలు ప్రజల నుంచి రాలేదు. కనీసం.. సోషల్ మీడియాలో అయినా.. ఉద్యమాలు రాలేదు. అంటే.. ప్రజలు.. అమరావతినే ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారనేది.. వారి మౌనాన్ని బట్టి అర్ధమవు తోంది. ఇక, ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినా.. ఇక్కడ కూడా సర్కారు చెబుతున్న రాజధాని కోసం.. ప్రజ ల్లో సెంటిమెంటు కనిపించడం లేదు.
ఈ పరిణామమే.. ఇప్పుడు.. రాజకీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. తాము చెబుతున్న మూడు రాజధానులకు ప్రజల నుంచి ఎలాంటి.. అభిప్రాయాలూ రావడం లేదు. పోనీ.. రైతులు చేస్తున్న పాద యాత్రకు కూడా వ్యతిరేకంగా.. ఎవరూ స్పందించడం లేదు. ఇదే బలపడి.. ఉత్తరాంధ్ర వరకు.. పాదయాత్ర సాగితే.. తాము చెబుతున్న మూడు రాజధానులకు ప్రజల నుంచి మద్దతు లేదనే.. వాదన బలపడు తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నేతలు తర్జన భర్జన పడుతున్నారు.
అందుకే.. ఎదురు దాడులు.. విమర్శలు పెంచుతున్నారు. ఏదేమైనా.. రైతుల ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా.. ఆపేయాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. ఈ కుయుక్తులు ఎన్నాళ్లో సాగవనేది.. వారి మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 15, 2022 9:54 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…