మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. ఆళ్ళగడ్డ నుండి పోటీచేస్తున్నారంటే ఆమెకు పోటీగా మరో గట్టినేత లేరు కాబట్టి చంద్రబాబునాయుడు కూడా చివరినిముషంలో అయినా ఓకే చెప్పే అవకాశముంది. అలాంటిది తనంతట తానుగా ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు మారాలని డిసైడ్ అయ్యారనే ప్రచారంతో పార్టీలో గందరగోళం మొదలైపోయింది.
ఎప్పుడైతే అఖిల వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయటానికి ట్రై చేస్తున్నారనే ప్రచారం మొదలైందో వెంటనే నంద్యాలలోని నేతలంతా అలర్టయ్యారు. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి లాంటి నేతలంతా గోల పెడుతున్నారు. వీళ్ళ గోలకు కారణం ఏమిటంటే నంద్యాలలో పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అఖిల మంచి భవనం కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే ఆళ్ళగడ్డలో పార్టీ ఆఫీసుతో సంబంధంలేకుండా సొంతంగా ఆమె ఒక ఆఫీసును పెట్టుకున్నారు.
ఆళ్ళగడ్డలో ఉన్నట్లే నంద్యాలలో కూడా సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దానికితోడు ఎక్కువగా నంద్యాలలోనే అఖిల క్యాంపు వేస్తున్నారట. ఆళ్ళగడ్డకన్నా నంద్యాలలోనే అఖిల ఎక్కువగా కనబడుతుండటంతో పార్టీలో కూడా అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఫరూక్ అండ్ కో చంద్రబాబునాయుడుతో ప్రస్తావించారట. అయితే చంద్రబాబు స్పందన ఏమిటో బయటకు రాలేదు. కానీ నేతల్లో గందరగోళం మాత్రం పెరిగిపోతోందట.
అసలు ఆళ్ళగడ్డలోనే అఖిలకు చంద్రబాబు టికెట్ ఇస్తారా ? ఇచ్చినా ఆమె గెలుస్తారా అనేది సందేహమే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎలాగున్నా ఆళ్ళగడ్డ, నంద్యాలలో అఖిల బాగా కంపైపోయారు. ఎక్కడ చూసినా గొడవలే, ఏ నేతతోను సరైన సంబంధాలు లేవు. ఎవరిని పడితే వారిని ఎంతపడితే అంత మాట్లాడుతారనే ప్రచారం బాగా ఉంది. సీనియర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వరన్న కారణంగానే చాలామంది నేతలు మాజీమంత్రికి దూరమైపోయారు. మరిలాంటి సమయంలో నంద్యాలలో అఖిల పోటీ అంటే ఆలోచించాల్సిందే.
This post was last modified on September 19, 2022 9:33 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…