రాజకీయాల్లో ఎవరో ఒకరు.. అన్నట్టుగా.. ఇప్పుడు టీడీపీలో పాలకొల్లు నియోజకవర్గం తాలూకు.. విజయం తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ముందున్న కీలక వ్యూహం.. పార్టీని ఎట్టిపరిస్థితిలోనూ.. అధికారంలోకి తీసుకురావడమే. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరిస్తే.. బెటరో.. ఇప్పటికే ..అనేక ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి కూడా. ఈ క్రమంలో తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు పాలకొల్లు ఫైల్ చేరింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ నుంచి వరుసగా.. టీడీపీ విజయం దక్కించుకుంటోంది. వరుసగా నిమ్మల రామానాయుడు గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. గత జగన్ సునామీలోనూ.. ఆయన విజయం సాధించారు. అయితే.. సాధించిన దానికి ఆయన సంతృప్తి చెందలేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. కూడా.. ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకుంటున్నారు. వారికి ఆర్థికంగా.. ఇతరత్రా కూడా అండగా నిలుస్తున్నారు.
అంతేకాదు.. అదేసమయంలో ప్రభుత్వంపై చురక్కు- చమక్కు అన్నట్టుగా.. విమర్శలు కూడా చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ కార్యక్రమాలను.. ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ బలమైన గళం వినిపిస్తున్నారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గంలో మరో పార్టీ పావులు కదపకుండా.. బలం పుంజుకోకుండా.. ఎమ్మెల్యే నిమ్మల వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనేది వాస్తవం. ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో.. పక్కాగా గెలిచే నియోజకవర్గాల్లో పాలకొల్లు ముందు వరుసలో ఉన్నట్టు తేలింది.
అంతేకాదు.. ఇక్కడ నిమ్మలకు తిరుగేలేదని.. కూడా పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మల అనుసరిస్తున్న ఫార్ములాను.. రాష్ట్రంలో కనీసం 100 నియోజకవర్గాల్లో అమలు చేస్తే.. ఖచ్చితంగా పార్టీ పుంజుకుని.. సునాయాశంగా అధికారంలోకి వస్తుందనేది సీనియర్ల మాట. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రెడీ చేసుకుని.. ప్రతి నియోజకవర్గానికీ.. దీనిని అందించి.. పార్టీ విజయం దిశగా.. నాయకులను నడిపించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తారో.. లేదో చూడాలి.
This post was last modified on August 31, 2022 11:05 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…