Political News

టిక్ టాక్ డేటా ఎక్కడుందో తెలిసిపోయింది

మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలో పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. యువతను ఓ ఊపు ఊపింది. అయితే… ఇది ఎన్నో అరాచకాలకు అపార్థాలకు అక్రమసంబంధాలకు కూడా దారితీసింది. నేరాలకు, సైకోలకు, శాడిస్టులకు కూడా ఇది ఉపయోగపడింది. అలా అని అన్నీ ఇందులో చెడే ఉందనీ కాదు. దీనివల్ల ఎన్నో జుగాడ్ ఐడియాలు ప్రపంచానికి తెలిశాయి. ఇంకా ఎందరో టీవీ, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. స్టార్లుగా మారి రాజకీయ నేతలు అయిన వారు కూడా ఉన్నారు. దీని మంచి చెడులు పక్కన పెడితే … చైనా వేసిన వెధవ వేషాలకు బలైన యాప్స్ లో ఇదొకటి.

తమకు అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాను కోల్పోవడం టిక్ టాక్ కు చావు దెబ్బ. అందుకే తిరిగి ఇండియా మన్ననలు పొందడానికి టిక్ టాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక సీక్రెట్ ను వెల్లడించారు టిక్ టాక్ నిర్వహకులు. తమ యాప్ లో సేవ్ అయిన డేటా ఇమ్మని మమ్మల్ని చైనా అడగలేదు. అడిగినా మేము ఇచ్చేది లేదు. అసలు మా డేటా చైనాలో లేనేలేదు అని పేర్కొన్నారు సీఈఓ కెవిన్ మాయర్.

తమ డేటా మొత్తం సింగపూర్ లోని తమ సర్వర్లలోనే భద్రపరిచి ఉందని… అది కంపెనీ ఆధీనంలో మాత్రమే ఉందని అన్నారు. మేము ఎవరితోను ఇండియా డేటాను పంచుకోలేదన్నారు. అసలు చైనాకు దూరంగా జరగాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు కెవిన్.

ఇన్ని విషయాలు చెప్పే కెవిన్ వద్ద ఒక ప్రశ్నకు సమాధానం లేదు… ఇటీవల చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేసింది. మా టిక్ టాక్ వాడకుండా ఉండండి చాలు … మీరసలు ఉండలేరు అంటూ ఎగతాళి చేసింది. అపుడు కెవిన్ స్పందించలేదు. ఇది చైనాకు సంబంధించిన యాప్ కాదు. దీనిని ఓన్ చేసుకుని రాజకీయాలు చేయొద్దు అని ఆరోజు కెవిన్ చైనాకు కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అంటే కెవిన్ వద్ద ఆన్సర్ లేదు. ఏదిఏమైనా… ఇప్పట్లో ఈ కంపెనీకి మళ్లీ ఇండియాలో ఎంటరయ్యే ఛాన్స్ లేదని మాత్రం అర్థమవుతుంది.

This post was last modified on July 4, 2020 8:24 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ప్రశాంత్ వర్మకు మొదటి షాక్ తగిలింది

నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…

46 mins ago

జమిలి వచ్చినా.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…

49 mins ago

బాలీవుడ్ బేబీకి హీరో దొరికాడు

ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…

58 mins ago

ఆంధ్రోడి సగటు అప్పు లెక్క కట్టిన కాగ్

పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…

2 hours ago

జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్

అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago