రాజంపేట…రాజకీయాలు ఎవరికీ అంతుబట్టవు. ఎందుకంటే.. కడప జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ కుటుంబానికి హవా మామూలుగా ఉండదనే పేరుంది. అయితే.. ఒక్క రాజంపేటలో మాత్రం.. రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ టీడీపీ నేతలు గెలిచారు.. కాంగ్రెస్ నేతలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. తర్వాత.. వైసీపీ నేతలకు కూడా ఛాన్స్ ఇచ్చారు. 2014లో టీడీపీ అభ్యర్థి.. మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు.
కడప మొత్తంలో టీడీపీ సాధించిన ఏకైక విజయం ఇది ఒక్కటే. అయితే.. ఆయన తర్వాత.. వైసీపీ పంచన చేరి.. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై మరోసారి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మళ్లీ మేడా టీడీపీవైపు చూస్తున్నారనేచర్చ జరుగుతోంది. రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని.. తెరమీదికి వచ్చిన ఉద్యమాల్లో మేడా కుటుంబం కూడా పాల్గొంది.
దీనికి సంబంధించి ఆయన ఏకంగా సీఎం జగన్‌తోనూ భేటీ అయ్యారు. అయినా.. రాయచోటినే జిల్లా కేం ద్రంగా ప్రకటించారు. ఇది మేడాను హర్ట్ చేసింది. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ కార్యక్రమాలకు దూరం గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అవకాశం కోసం.. ఎదురు చూస్తున్నారు. ఘర్ వాపసీ మంత్రాన్ని సైతం పఠిస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే..మేడాకు టీడీపీ టికెట్ ఖాయం. ఇక,వైసీపీ తరఫున ఏకంగా.. జగనే ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది.
మరోవైపు.. బీజేపీ తరఫున మాజీ మంత్రి.. చడిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయను న్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన.. మంత్రి అయ్యారు. అయితే.. ఆ తర్వాత.. మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయన రాజంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. దీంతో రాజంపేట నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఇక, ఇక్కడి ప్రజలు కానిస్టెంట్‌గా అయితే ఉండరు. అన్ని పార్టీలనూ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కుతారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on August 8, 2022 10:45 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…