మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న సంగతి తెలిసిందే. తీవ్రమైన జ్వరం, విపరీతమైన పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు…ఇవి కరోనా సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు. వీటితో పాటు అసలు ఏ లక్షణాలు లేకుండా కూడా కరోనా బారిన పడ్డవారూ ఉన్నారు. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపే ఈ ప్రాణాంతక వైరస్….శ్వాస సంబంధిత రోగాలతో బాధపడే వారిని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. ఈ నేపథ్యంలో పారిస్ లో ఓ కరోనా పాజిటివ్ రోగిలో ఓ వింత లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. కరోనా బారిన పడ్డ 62 ఏళ్ల రోగి పురుషాంగం నాలుగు గంటలపాటు స్తంభించి ఉండడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. కరోనా సోకడం వల్ల ఆ రోగి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగలేదని, పురుషాంగంలో రక్తం సరఫరాలో అంతరాయం వల్ల అంగం అంతసేపు స్తంభించిందని వారు గుర్తించారు. ఈ రకమైన పరిస్థితిని ప్రియాపిజమ్ అంటారని, గతంలో ఆ రోగికి అ అటువంటిది ఎపుడూ జరగలేదని వైద్యులు గుర్తించారు.
ఆ రోగి రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు….నలుపు రంగులో రక్తం గట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆ రోగి శరీరంలో అధికశాతంలో కార్బన్ డయాక్సైడ్, తక్కువ శాతంలో ఆక్సిజన్ శాతాలున్నాయని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరేటపుడు ఆ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని…14 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన తర్వాత వెంటిలేటర్ తొలగించామని తెలిపారు. అయితే, ఏప్రిల్ నెలలోనూ ఈ రకంగా కొందరు కరోనా పాజిటివ్ రోగుల్లో రక్తం గడ్డకట్టిన దాఖలాలున్నాయని, కానీ, ఈ రోగి మాదిరిగా ప్రియాపిజమ్ లక్షణాలు లేవని తెలిపారు. రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సరిగా జరగదని, అటువంటి సందర్భంలో రోగిలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో ఈ స్థితి ఎందుకు వస్తుందన్న దానిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు.
This post was last modified on July 2, 2020 7:33 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…