Political News

పరీక్షలు చేయటంలో పాస్.. ఫలితాల విషయంలో ఏపీ ఫెయిల్?

ఒక రాష్ట్రానికి నాలుగు వందల వాహనాల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసి.. రోజువారీగా పెద్ద ఎత్తున కరోనా టెస్ట్ శాంపిల్స్ ను ప్రజల వద్ద నుంచి సేకరిస్తున్న జగన్ సర్కారు విషయం తెలిసిందే. రోజులో తక్కువలో తక్కువ పాతికవేల వరకు నిర్దారణ పరీక్షలు చేస్తూ.. మిగిలిన రాష్ట్రాలకు కంటగింపుగా మారింది జగన్ ప్రభుత్వం. టెస్టులు చేసే విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్న ఏపీ ప్రభుత్వం.. వాటి ఫలితాల్ని వెల్లడించే విషయంలో మాత్రం తప్పులో కాలేస్తున్నట్లుగా చెప్పాలి.

ముందుగా అనుకున్న దాని ప్రకారం టెస్టులు చేయించుకున్న వారికి పాజిటివ్ లేదంటే నెగిటివ్.. ఫలితం ఏమైందన్న విషయాన్ని ఇరవైనాలుగు గంటల వ్యవధిలోనే ఇచ్చేయాలని డిసైడ్ చేశారు. అయితే.. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిష్తున్న నేపథ్యంలో ఫలితాల్ని వెల్లడించటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు.. సిబ్బంది కొరత కూడా కరోనా పరీక్షా ఫలితాల వెల్లడిలో ఆలస్యమయ్యేలా చేస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీలో పలితాలు వెల్లడించాల్సిన శాంపిళ్లు ఏకంగా లక్ష మేర ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వేలాది సంఖ్యలో ఫలితాలు వెల్లడించకుండా పెండింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రజల విషయానికి వస్తే..

శాంపిల్ ఇచ్చేశాం.. తమకేం ఫర్లేదన్న రీతిలో ఏపీ ప్రజలు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పరీక్షలకు నమూనాల్ని ఇచ్చి రావటంతో తమ బాధ్యత అయిపోయిందన్న భావనలో ఉండటం ఏ మాత్రం సరికాదని చెప్పక తప్పదు. నమూనాల్ని ఇచ్చిన వారు ఫలితాలు వచ్చే వరకూ ఇళ్లకే పరిమితం కావాలి. అందుకు భిన్నంగా వారిలో ఎక్కువమంది బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఫలితాలు వచ్చిన తర్వాతే బయటకు రావాలన్న సూచన పలువురి నోట వ్యక్తమవుతోంది.

ఏమైనా.. నమూనాల సేకరణ విషయంలో తిరుగులేని రీతిలో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న జగన్ సర్కారు.. ఫలితాల వెల్లడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో జరిగే తప్పులు.. ఏపీలో కేసులు పెరిగేందుకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.మరీ.. విషయంలో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో?

This post was last modified on July 2, 2020 5:16 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

58 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago