నోరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికే అనలేదు. తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుదేశాలకు స్వయంగా వెళ్లిన ప్రధానమంత్రి మోడీ.. అందరికి స్నేహహస్తాన్ని చాచటమే కాదు.. అందరితోనూ కలుపుకుపోయే గుణాన్ని ప్రదర్శించారు. అంతేకాదు.. దశాబ్దాలకు దశాబ్దాల పర్యంతం ప్రధాని హోదాలో వెళ్లని దేశాలకు వెళ్లటం ద్వారా మోడీ పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఒకట్రెండు ఏళ్ల పాటు అదే పనిగా పలు దేశాల్లో పర్యటించటం ద్వారా స్నేహసంబంధాల్ని పటిష్టం చేసుకోవటంలో సక్సెస్ అయిన మోడీకి.. ఇప్పుడవన్ని సమయానికి కలిసి వస్తున్నాయి.
ఇటీవల చైనా.. పాక్ లతో భారత్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. యుద్ధ ప్రాతిపదికన స్పైస్2000 బాంబుల్ని భారత వైమానిక దళానికి ఇచ్చేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాల్ని కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
గత ఏడాది పాక్ లోని బాలకోట్ లోని తీవ్రవాద స్థావరాలపై నిర్వహించిన సర్జికల్ స్టైక్స్ లో వినియోగించిన బాంబులు ఇవే. వీటినిఫ్రాన్స్ లో తయారైన మిరాజ్ 2000 జెట్స్ ద్వారా వినియోగిస్తారు. గగనతలం నుంచి భూతలంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈ బాంబులు సాయం చేస్తాయి. శత్రుదేశాల బంకర్లు.. భవంతుల్ని క్షణాల్లో పూర్తిగా నేలమట్టం చేసే సామర్థ్యం ఈ బాంబుల సొంతం.
ఈ బాంబుల్ని ఇప్పటికే భారత్ కొనుగోలు చేసింది. గత ఏడాది కొనుగోలు చేసిన దానికి అదనంగా మరోసారి ఈ బాంబుల్ని కొనుగోలు చేస్తోంది. స్సైస్ అంటే స్మార్ట్.. ప్రిసైజ్.. ఇంపాక్ట్.. కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ బాంబుల్ని అభివర్ణిస్తారు. ఇదిలా ఉంటే.. భారత్ కుఅవసరమైన రాఫెల్ యుద్ధ విమానాల్ని కూడా ఈ నెలాఖరు నాటికి భారత్ కు పంపుతామని ఫ్రాన్స్ సైతం చెప్పటం తెలిసిందే. ఈ విమానాలతో భారత్ మరింత శక్తివంతం కావటం ఖాయం.
This post was last modified on July 2, 2020 5:12 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…