వైసీపీలో తీవ్ర సంచలనంగా మారిన ఈ నినాదం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. మనం ఇంటకే జగనన్నా.. అంటూ.. నాయకులు లబోదిబోమంటున్నారు. ఇంతకీ.. ఏం జరిగింది? ఎందుకు? అంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ రద్దును తొక్కి పెట్టి..రాష్ట్ర ప్రభుత్వం మరో 4200 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోదన్న వ్యాఖ్యలు.. మీడియాలో జోరందుకు న్నాయి. బుధవారం ఈ వార్తలు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
దీనిపై దృష్టి పెట్టిన వైసీపీ నాయకులు.. ఇదే నిజమైతే.. ఇక, మనల్ని కాపాడేవారు ఎవరున్నారు? అనే కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఉద్యోగులకు వైసీపీ అధినేతగా జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే.. వారంలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని ప్రకటించారు. అయితే.. ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోగా.. సుదీర్ఘ ఉద్యమం తర్వాత.. సీపీఎస్ పై మడమ తిప్పేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పింఛన్ పథకం(జీపీఎస్)ను తెరమీదికి తెచ్చారు.
అయితే.. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు అంగీకరించడం లేదు. కానీ, సర్కారు మాత్రం.. సీపీఎస్‌పై ముందుగా తమకు అవగాహన లేదని.. ఇప్పుడుకళ్లు తెరుచుకున్నామని.. కాబట్టి.. దీనివల్ల.. ఆర్థికంగా భవిష్యత్తులో రాష్ట్ర సర్కారుకు కష్టాలు వస్తాయని.. పేర్కొంది. అందుకే.. తాము రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఉదారంగా వ్యవహరిస్తున్నామని.. సలహాదారు సజ్జల పేర్కొన్నారు. దీంతో ఇది నిజమేనేమో.. జగన్‌సర్కారు ఏపీ భవితకు కట్టుబడిందేమో.. అని అందరూ అనుకున్నారు.
కట్ చేస్తే.. ఇన్నాళ్లకు పార్లమెంటు వేదికగా.. అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) పథకం కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి ఆ మేరకు బహిరంగ మార్కెట్‌లో కొత్త రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి పొందింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
దీంతో సీపీఎస్ రద్దు.. వెనుక.. వైసీపీ సర్కారు చెబుతున్నట్టు.. రాష్ట్ర ప్రయోజనాలు.. భవిష్యత్తులో తలెత్తబోయే.. ఆర్థిక భారాలు కాదు.. ప్రస్తుతం అప్పులు మాత్రమే సర్కారుకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై.. వైసీపీలోనూ తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఇది నిజమైతే.. తమకు ఇబ్బందులు తప్పవని.. ఉద్యోగులను మోసం చేశామన్న పేరుతో పాటు.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం కూడా లేదని.. వైసీపీ నాయకుల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on July 27, 2022 2:31 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…