నాన్ ఎన్డీయే పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఎలా ఓడిపోయారో అందరు చూసిందే. నామినేషన్ వేసేంతవరకు ఒకటిగా ఉన్న ప్రతిపక్షాల్లో తర్వాత చాలావరకు యశ్వంత్ కు హ్యాండిచ్చాయి. యూపీఏలో భాగస్వామి అయిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం హేమంత్ సోరేన్ అధికారికంగానే ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. తర్వాత చాలామంది ఏదో కారణం చెప్పి ముర్ముకే మద్దతుగా నిలిచారు. చివరకు ముర్ము అత్యధిక మెజారిటీతో గెలిచారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీ మొదలైంది. ఆదిలోనే మమతా బెనర్జీ పెద్ద దెబ్బకొట్టారు. నాన్ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మార్గరెట్ ఆల్వాకు మద్దతిచ్చేది లేదని ప్రకటించారు. అభ్యర్థి ఎంపికలో తృణమూల్ కాంగ్రెస్ ను పరిగణలోకి తీసుకోలేదని సాకుతో తమ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికనే బహిష్కరిస్తున్నట్లు చెప్పేసింది. నాన్ ఎన్డీయేలో అతిపెద్ద పార్టీయే చెయ్యి చేసిన తర్వాత ఇక ఆల్వాకు పడే ఓట్లు ఎన్నుంటాయి.
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ కే పూర్తిగా ఓట్లేయని ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతిగా ఆల్వాకు వేస్తాయా ? అనుమానమే అవసరం లేదు మెల్లిగా ఒక్కోపార్టీ జారుకునేస్తుంది. ఆల్వాకు మిగిలేది తీరని పరాభవం మాత్రమే. ఇక్కడ ఓడిపోవటం అవమానం కానేకాదు. కాకపోతే పోటీకి నిలబెట్టిన పార్టీలే నూరుశాతం ఓట్లేయకపోతే అవమానం కాక మరేమిటి ? ఈ మాత్రం దానికి అసలు 84 ఏళ్ళ యశ్వంత్ ను 80 ఏళ్ళున్న ఆల్వాను పోటీలోకి ఎందుకు దింపాలి ?
అప్పుడు యశ్వంత్ అయినా ఇపుడు ఆల్వా అయినా గెలుస్తామనే నమ్మకంతో పోటీలోకి దిగుండరన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పటమే టార్గెట్ గా మొదట్లో అందరు సమావేశాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే చాలా పార్టీలు ఏదో కారణంగా ద్రౌపదికే జై కొట్టాయి. ఇపుడేమో ఏకంగా టీఎంసీ ఓటింగ్ నే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించేసింది. ఇంకెన్ని పార్టీలు ఓటింగ్ ను బహిష్కరిస్తాయో చూడాలి.
This post was last modified on July 22, 2022 11:50 am
వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు.…
విశాఖపట్నానికి పెట్టుబడులు, ఐటీ సంస్థల రాకతో ఇప్పటికే భారీ మైలేజీ వచ్చింది. గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు కానున్న నేపథ్యంలో…
కొత్తగా ఫోన్ కొంటున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇకపై మీరు కొనే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో…
వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న కొందరు.. కూటమి ప్రభుత్వం రాగానే.. తమ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన…
ఏపీ సీఐడీ చీఫ్‌గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేయాలని…
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ``నా మిత్రుడు..``అంటూ…