ఆమె లేడీ డాక్టర్. మరోమాటలో చెప్పాలంటే.. సీఎం జగన్ ఇంటి డాక్టర్ కూడా. హైదరాబాద్‌లో ఆమెకు ఉన్న ఆమె మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలోనే.. సీఎం జగన్ కుటుంబం తరచుగా వైద్య సేవలు పొందుతూ ఉంటుందని అంటారు. ఈ పరిచయాల నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఆమెకు జగన్ పిలిచి టికెట్ ఇచ్చారు. అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి మరీ.. లేడీ డాక్టర్‌కు టికెట్ కేటాయించారు. ఆమే.. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
భీకరమైన పోరులో ఆమె స్వల్ప ఓట్ల ఆధిక్యతతో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆ తర్వాత నుం చి ఆమె పక్కా మాస్ నాయకురాలిగా వ్యవహరించారు. రాజధాని విషయంలో .. రైతులను నిత్యం రెచ్చగొ ట్టారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. వారివల్ల ఏమీ జరగదన్నారు. జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. అదేసమయంలో సొంత పార్టీ నేతలతో మాత్రం నిత్యం కయ్యాలకు కాలుదువ్వారు. ఎంపీ సహా.. పొరుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ వివాదాలు సృష్టించుకున్నారు.
ఫలితంగా జగన్ దగ్గర ఉన్న ఇమేజ్ కాస్తా డ్యామేజీ అయిపోయింది. సరే.. ఇదిలావుంటే.. తాజాగా గడప గడపకు కార్యక్రమంలో ఆమె ఇలా ముఖం చూపించి.. అలా వెళ్లిపోతున్నారు. ప్రజలు ఆమెను నిలదీస్తుం డడంతో .. ఒకటి రెండు సార్లు వారికి సమాధానం చెప్పారు. కానీ.. వివాదాలు పెరుగుతుండడంతో కొన్నాళ్లు గా అది కూడా మానేశారు. దీనికి తోడు.. సొంత కార్యకర్తలు కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో తాము అన్నిరూపాల్లోనూ సాయం చేశామని.. కానీ, తమకు ఏమీ చేయలేదని.. కార్యకర్తలు రెండుగా చీలిపోయారు.
ఫలితంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఇల్లు దాటినా.. జెండో పట్టుకునే కార్యకర్తకానీ, జై కొట్టే నాయకుడు కానీ.. ఉండవల్లికి కరువయ్యారనేది వాస్తవం. అయితే.. ఇలాంటి పరిణామాల వెనుక స్థానిక ఎంపీ ఉన్నారనేది ఆమె వాదన. అయితే.. సదరు ఎంపీ.. విషయంలోఅధిష్టానం పాజిటివ్‌గా ఉండడం.. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఉండవల్లిని దూరం పెట్టి.. ఎంపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉండవల్లి.. పార్టీ కార్యక్రమాలు.. దూరంగా ఉంటున్నారని.. ఆమె కూడా మానసికంగా సిద్ధమయ్యారని అంటున్నారు. సో.. ఏదేమైనా.. ఇక, లేడీ డాక్టర్ ఎమ్మెల్యే ఇక, ఆస్పత్రికే పరిమితం కానుందన్నమాట.
This post was last modified on July 19, 2022 3:58 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…