చెప్పాడంటే చేస్తాడంతే! అనే నినాదంతో వైసీపీ అధినేత జగన్‌ను కొనియాడే ఆ పార్టీనాయకులు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. జగన్ చెప్పినట్టే.. రాష్ట్రంలోని 13 జిల్లాల ను 26 జిల్లాలుగా మార్చారు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు.. విమర్శలు వచ్చినా.. లెక్క చేయకుండా జిల్లాల విభజనచేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఈ జిల్లాల విభజనకు 100 రోజులు పూర్తయ్యాయి. ఇంత వరకుబాగానే ఉంది.
మరి జగన్ ఆశించింది జరిగినా.. జనాలకు ఒరిగిందేంటనేది ప్రశ్న. ఎందుకంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత చేరువ అవుతుందని.. ప్రజలకు అత్యంత సమీపంలోనే అధికారులు ఉంటారని.. వారికి పనులు కూడా అవుతాయని.. ప్రభుత్వం చెప్పింది. కానీ, 100 రోజులు గడిచినా.. ఎక్కడా అలాంటి వాతావరణం కనిపించడం లేదని.. ప్రజలు చెబుతున్నారు. ఇక, అధికారులు కూడా ఆయా జిల్లాల్లో ఎక్కడా ఉండడం లేదు. వారు ఉండేందుకు.. పనిచేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లు లేవు.
దీంతో అధికారులు కానీ.. సిబ్బంది కానీ.. మళ్లీ పాత పద్ధితినే అనుసరిస్తున్నారు. ఇక, ప్రజలు కూడా ఏ కార్యాలయాలనికి వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోనే అన్నీ ఉండేవి. కానీ, ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఏ ఆఫీసు ఎక్కడుందో.. ఏ అధికారిని కలవాలో తెలియక ప్రజలు తిప్పలు పడుతన్నారు. కొత్త జిల్లాలను అయితే.. ఆర్భాటంగా ప్రకటించారు కానీ.. ఆ జిల్లాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లో సర్కారు విఫలమైంది.
ఇక, అదేసమయంలో జిల్లాలపై అధికారులకు కూడా పట్టులేదనే వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రులు కూడా ఆఫీసులను పట్టించుకోవడం లేదు. గుంటూరులోని పల్నాడు, పశ్చిమలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి చోట్ల ఇంకా.. కనీసం కార్యాలయాలను కూడా చూపించకపోవడంతో ఇప్పుడున్న జిల్లా కేంద్రా ల్లోనే పనులు చేస్తున్నారు. మరి అధికారులకే ఇన్ని తిప్పలు ఉంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేది ప్రశ్న. మరి జిల్లాల ఏర్పాటుపై ఉన్న దూకుడు.. తర్వాత లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చూస్తే.. తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి.. అన్నట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 16, 2022 2:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…