తెలంగాణ రాష్ట్రంలో నేతల పరంగా, ఎమ్మెల్యేల సంఖ్య పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ గత కొద్దికాలంగా ముఖ్యమైన అంశాల విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ స్పందిస్తోందనేది విశ్లేషకుల కామెంట్. కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో అయితే, ఈ రెండు పార్టీల మద్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తాజాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ మంత్రుల పరువు తీసేసేలా…మంత్రులు పొలాల్లో దిష్టిబొమ్మల్లా తయారయ్యారని ఆయన విరుచుకుపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే వేములవాడలో పట్టణంలోని 16, 26 వార్డులలో పర్యటించి సీసీ రోడ్, డ్రైనేజీల కోసం భూమి పూజ చేసిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని.. అప్పుడప్పుడు పక్షులు వాలిన సమయంలో దిష్టిబొమ్మలు కదిలినట్లు కదులుతుంటారని ఎద్దేవా చేశారు. రోడ్లను శాంక్షన్ చేయని రోడ్ల శాఖ మంత్రి.. పైసా ఇవ్వని పైనాన్స్ మంత్రి.. కనీసం హోమ్ గార్డ్ ను కూడా ట్రాన్స్ పర్ చేయలేని హోం మంత్రి.. కనీసం ఒక్క బస్ ను శాంక్షన్ చేయని మంత్రులు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం అడిగితే.. పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తద్వారా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు నుంచి మొదలుకొని హోంమంత్రి మహమూద్ అలీ వరకూ అంతా కేసీఆర్ ముందు ఒకటేనని పరోక్షంగా చెప్పేశారు.
కరోనా విషయంలో రాష్ట్ర స్థాయిలో బులెటిన్‌కి, జిల్లా అధికారులు చెబుతున్న దానికి పొంతన కనిపించడం లేదని పాజిటివ్ కేసుల సంఖ్యలో చాలా తేడాలున్నాయని బండి సంజయ్ అన్నారు. కరోనా పరీక్షలు కూడా సరిగా చేయడం లేదు…బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో 5 లక్షల టెస్టులు, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లో 3 లక్షల టెస్ట్ లు చేశారు.
కరోనా ప్రభావం మొదలయ్యాక కేంద్రం 20 లక్షల కోట్లు కేటాయిస్తే…దాన్ని కూడా సీఎం కేసీఆర్ తప్పు పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్క దారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి కాబట్టి.. సీఎం జీర్ణించుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కాపాడే పరిస్థితిలో లేడని, ఇప్పటికే చేతులు ఎత్తేశారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని.. పేద ప్రజలను పట్టించుకోవాలని సూచించారు.
This post was last modified on June 26, 2020 2:05 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…