సింహం సింగిల్ గానే వస్తుంది అని అంటున్నారు అంబటి రాంబాబు లాంటి నాయకులు. తమ నేతకు ప్రజా క్షేత్రాన తిరుగులేదని అంటున్నారు అంబటితో సహా మిగతా నాయకులు కూడా ! తప్పేం లేదు ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. ఎవరి నమ్మకాలు వారివి అయి ఉంటాయి. వాటిని కాదనుకుని పార్టీలు మనుగడ సాగించ లేవు కూడా ! నిండా మునిగాక కూడా ఎవరో రక్షిస్తారన్న నమ్మకం ఒకటి మనుషుల్లో ముఖ్యంగా నాయకుల్లో ఉంటుంది.
ఆ విధంగా టీడీపీ కానీ ఆ విధంగా వైసీపీ కానీ రాజకీయం చేయాల్సిందే ! తాజా పరిణామాల్లో భాగంగా చాలా చోట్ల వైసీపీకి నిరసన స్వరాలే పలకరిస్తున్నాయి. ముఖ్యంగా దాసన్న (మాజీ డిప్యూటీ సీఎం) లాంటి వారు అయితే నిరసనలను లైట్ తీసుకుంటున్నారు. లేదా స్థానిక నాయకత్వాలను ఆదేశించి మాట్లాడే గొంతుకలు మీడియా ముందుకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఇవేవీ లేకపోతే ఏంట్రా ! మనం అంతా ఒకే ఇంటి పేరోళ్లం ఎందుకిలా అడ్డుకుంటున్నారు అని కూడా చెప్పి.. ధర్మాన దాసన్న తప్పుకుంటున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి.
క్షేత్ర స్థాయిలో మంత్రి వర్గానికి సంబంధించి జిల్లాలకు చెందిన ఇంఛార్జుల కన్నా పార్టీ ఇంఛార్జులే ఎక్కువ. అదేవిధంగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ప్రసాదరావు కన్నా కృష్ణ దాసే ఎక్కువ.. పదవి రీత్యా ప్రాధాన్య క్రమం రీత్యా కూడా ! ఇదే ఒపీనియన్ గతంలో జగన్ బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నదే అది.
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు హవా కన్నా పదవి ఉన్నా లేకపోయినా దాసన్న హవా నడుస్తోంది. దాంతో వైసీపీలో గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. అసంతృప్తులు బాగా పెరిగిపోతున్నారు. నిన్నటి వరకూ కాళింగులు కొంత అనుకూలంగా ఉన్నా కృపారాణికి పదవి ఇవ్వకపోవడంతో వాళ్లు కూడా కాస్త ఎడముఖం పెడముఖం అన్న చందంగానే పార్టీ అధినాయకత్వంతో ఇకపై మెలగనున్నారు అని తెలుస్తోంది. వెలమల్లో కాస్తో కూస్తో సఖ్యత ఉన్నా కొంత ధర్మాన సోదరుల ఇంటి పోరు కారణంగా వైసీపీకి ముందున్న కాలం కష్టమే ! దాదాపు ఐదు నియోజకవర్గాలపై ఆ ప్రభావం కనిపించనుంది. ఇదే అదునుగా టీడీపీ బాగా బలపడుతోంది.
రెవెన్యూ మినిస్టర్ ధర్మాన, ఎడ్యుకేషన్ మినిష్టర్ బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం మరియు చీపురుపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ యువ నాయకత్వాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ ఎంపీ రాము, ఆయన అనుచర వర్గం అక్కడ కిమిడి నాగార్జున, ఆయన అనుచర వర్గం బాగా పనిచేస్తున్నారు.
దీంతో ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలపడితే మిగిలిన ప్రాంతాలు సెంటిమెంట్ పరంగా 4 కాదు 40 విధాలుగా కలిసి వస్తాయన్న ఆశతో చంద్రబాబు ఉన్నారు. అందుకే సింగిల్ గా వెళ్లేందుకు కూడా యోచిస్తున్నారు అని తెలుస్తోంది. పొత్తుల కన్నా ఈ విధంగా సింగిల్ గా వెళ్తేనే బాగుంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారు అని తెలుస్తోంది. ఎలానూ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి కనుక., బీజేపీ ఇప్పటికే చెప్పిన విధంగా కుటుంబ పార్టీలతో కలవదు కనుక చంద్రబాబు ఈ విధంగా డెసిషన్ తీసుకునే అవకాశాలను కొట్టి పారేయ్యలేం.
This post was last modified on May 19, 2022 8:16 am
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…