లోకేష్‌ను గెలిపించుకోలేని.. చంద్రబాబుకు చీర పంపాలా.. చుడీదార్ పంపించాలా? అంటూ.. ఏపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు.. వంగలపూడి అనిత.. ఫైరయ్యారు. తన తల్లిని గెలిపించుకోలేని జగన్‌కు.. ఏ చీరపంపించాలంటూ.. ఆమె నిప్పులు చెరిగారు.
అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకు రాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి అనిత దుయ్యబట్టారు. “ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి, నాగమ్మ, ఈరోజు తెనాలి.. ఇలా వివాహితలు బలవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ కారణం కాదా?“ అని ప్రశ్నించారు.
లోకేశ్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారని, ముఖ్యమంత్రిలా ఇల్లు దాటి బయటకురాకుండా, పోలీస్ పహారా లేకుండా బయటకురాలేని దుస్థితిలో లేరని అన్నారు. లోకేశ్ ఓడిపోయారంటున్న రోజా ఓడి పోలేదా? అని ప్రశ్నించారు. తల్లిని విశాఖపట్నంలో గెలిపించుకోలేని జగన్ ఏరంగు చీరకట్టుకోవాలో రోజా చెప్పాలన్నారు.
“మహిళా సాధికారతంటే కచ్చాబాదం డాన్స్ లేస్తూ, జబర్దస్త్ షో కోసం నవ్వు రాకపోయినా.. పడిపడి నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదమ్మా రోజా“ అంటూ అనిత ఎద్దేవా చేశారు. మేం ఊరికో ఉన్మాది అంటే ఉలిక్కిపడుతున్నారెందుకని ప్రశ్నించారు. టీడీపీ పుస్తకం విడుదలచేశాకే వైసీపీ నేతల్లో చలనం వచ్చిందన్నారు. ఊరికో ఉన్మాది ఉన్నాడని తాము, తమపార్టీ నిరూపిస్తుందని.. అందుకు వైసీపీ నేతలు సిద్ధమా? అని సవాల్ చేశారు.
గుంటూరులో బాలికను నిర్బంధించి రోజుల తరబడి అత్యాచారం చేసింది వైసీపీకి చెందిన ఉన్మాదులు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి.. రోజా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. మీ లాంటి వారందరికీ ఎన్నిచీరలు కావాలో చెబుతే పంపిస్తామన్నారు. జగన్ రెడ్డి, భారతి గురించి మాట్లాడితే ఊరుకోవా.. ఆడబిడ్డలను కాపాడలేని అసమర్థుడి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడతామని, సాటి ఆడబిడ్డగా మహిళలపై జరిగే దారుణాలపై స్పందించలేని సీఎం సతీమణి గురించి మాట్లాడతామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
This post was last modified on April 29, 2022 9:17 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…