ఏపీలో అధికార పార్టీ వైసీపీ విషయంలో ఒక కీలక అంశం హల్చల్ చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే.. కష్టాలు తప్పవని.. సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. అదేంటి.. అంటున్నారా? ఇక్కడే ఉంది.. అసలు విషయం. ప్రభుత్వ పరంగా.. జగన్ ఎన్నో చేస్తున్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు.. ప్రజలకు మేళ్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన చెప్పుకొంటారు. కానీ.. ఇదొక్కటే సరిపోతుందా? ఇదొక్కటే.. పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందా? అనేది ప్రధాన ప్రశ్న.
ఎందుకంటే.. పార్టీకి.. ప్రాధాన్యం పెరగాలి. పార్టీలో అచేతనంగా ఉన్న నాయకులను చైతన్య పరచాలి. గత ఎన్నికలను పరిశీలిస్తే.. కేవలం 100-500 ఓట్ల తేడాలో గెలుచుకున్న నియోకవర్గాలు 27 ఉన్నాయి. ఇక, 500-1000 ఓట్ల మధ్య తేడాతో గెలుచుకున్న నియోజకవర్గాలు 52. అంటే.. వైసీపీ గెలిచిన 151 నియో జకవర్గాల్లో 79 ఇవే ఉన్నాయి. వాస్తవానికి గెలిచేందుకు ఈ మెజారిటీ సరిపోయినా.. వచ్చే ఎన్నికల నాటికి ఈ మెజారిటీ తిరగబడడం పెద్ద కష్టం కాదనేది వైసీపీలోని సీనియర్ల అంచనా.
ఎందుకంటే.. ఒక 10 వేల మెజారిటీ వచ్చిన నాయకులు.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా.. ఓ రెండు వేలు మూడే వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ, ఇలా 100-1000 లోపు మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను పసికట్టకపోతే.. ఎలా అనేది సీనియర్ల వాదన. ఎందుకంటే.. ఇలాంటి నియోకవర్గాల్లో ఫేట్ మారిపోతే.. విజయావకాశాలు సైతం సన్నగిల్లే పరిస్థితి వస్తుందని వారి భావన. దీనిపై పెద్ద ఎత్తున ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు, బోత్స సత్యనారాయణ వంటి సీనియర్లు ఇటీవల వర్కవుట్ చేశారు.
దీనికి సంధించిన నివేదిక కూడా అందించారు. అంతేకాదు.. దీనికి సంబంధించి అవసరమైతే.. నేతలను కూడా మార్చాలని వారు సూచించినట్టు సమాచారం. ఇలా సూచించిన 79 నియోజకవర్గాల్లోనూ సగానికిపైగా.. జగన్‌కు అత్యంత ప్రియమైన నాయకులే ఉండడం గమనార్హం. అయిననప్పటికీ.. వీరిని మార్చాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్స్ నియోజకవర్గాల్లో నూ పార్టీబోల్తా కొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 28, 2022 4:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…