Political News

ద‌ళిత బంధు నిధుల‌పై కేటీఆర్ క్లాస్‌

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు నిధులను విడ‌త‌ల వారీగా విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కంపై అనేక విమ‌ర్శ‌లు.. అవినీతి ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. అయినా.. వాటిని ప‌ట్టించుకోని.. స‌ర్కారు. నిధుల విష‌యంలో ఎలా వినియోగించుకోవాలో.. ఏది కొనాలో.. ఏది కొనొద్దో.. క్లాస్ పీకుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. మ‌రికొంద‌రు ఈ డ‌బ్బులు ఏవో త‌మ జేబుల్లోంచి ఇస్తున్న‌ట్టుగా మంత్రులు ఫీల‌వుతున్నార‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయి. “దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నేను రాను.” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

“రాష్ట్రంలో దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. రూపాయి పెట్టుబడితో రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలి. దేశంలో మంచి పని చేయడానికి లక్ష తొంభై అడ్డంకులు ఉంటాయి. కానీ చెడు పని చేయడానికి ఒక్కటి అడ్డంరాదు. దళితబంధు నిధులతో పలు రకాల వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు అంటున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింతగా వృద్ధి సాధించవచ్చు. కేవలం ఎస్సీలకే కాదు.. క్రమంగా మిగతా వర్గాలకు దళితబంధు తరహా పథకం ఇస్తాం. సమాజంలో రెండే కులాలున్నాయి.. పేద కులం, ధనిక కులం. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నేను రాను. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దళితబంధు పథకాన్ని విజయవంతం చేయాలి.” అని సూచించారు.

దళితబంధు పథకంతో దళితుల రూపురేఖలు మార్చడానికి ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో దళితబంధు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. దళితబంధు నిధులతో అందరూ వాహనాలే కాకుండా… వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి సంపదను రెట్టింపు చేసుకోవాలని కోరారు. దళితబంధు నిధులతో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.

దళితబంధు నిధులతో కొందరు ఒకే రకమైన వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారన్న ఆయన… ముగ్గురు, నలుగురు కలిసి వ్యాపారం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఎస్సీలనే కాదు.. క్రమంగా మిగతా వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త ఆలోచనలు చేసి దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ చిన్న పనులు చేసే వ్యక్తి కాదు. కేసీఆర్‌.. ఒక రిఫార్మర్‌, సమాజంలో మార్పు కోరుకొనే వ్యక్తి. 1987లో భారత్‌, చైనా రెండింటి జీడీపీ 470 బి.డాలర్లు. ఈ 35 ఏళ్లలో యూరప్‌, జపాన్‌తో చైనా పోటీపడింది. కులం, మతం జోలికెళ్లకుండా పెట్టుబడులకు పోటీ పడ్డారు. ఇప్పుడు మన దేశ జీడీపీ 2.93 ట్రిలియన్‌ డాలర్లు. ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లు. మన దేశంలో తలసారి ఆదాయం రూ.2వేల డాలర్లు. చైనా తలసరి ఆదాయం రూ.14వేల డాలర్లు. మనం కులం, మతం గొడవలంటూ అక్కడే ఉన్నాం. అని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

సందీప్ సక్సెస్… ఐశ్వర్య ఫెయిల్..!

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. నాగ‌బంధం, రావు బ‌హ‌దూర్ లాంటి ఆస‌క్తిక‌ర చిత్రాలు థియేట‌ర్ల‌లోకి దిగాయి.…

5 hours ago

అందాల శ్రీదేవికి మళ్ళీ ఆఫర్లు వస్తాయా?

తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ…

7 hours ago

గ్లామర్ డోస్ పెంచుతున్న త్రిష

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…

8 hours ago

790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన…

9 hours ago

ఏజెంట్ నిర్మాతతో ఏకీభ‌వించిన అఖిల్

అక్కినేని అఖిల్‌ను పెద్ద‌ స్టార్‌ను చేసేస్తుంద‌ని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంక‌ర సైతం రిలీజ్‌కు ముందు…

11 hours ago

తమన్ సంగీతానికి తమనే పోటీ

తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…

12 hours ago