అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నవ్వులు పూయించారు. గతంలోనూ పలుమార్లు తన అమాయకపు మాటలతో…భోళాగా మాట్లాడి కామెడీ చేసిన మధుసూదన్ రెడ్డి మరోసారి జబర్దస్త్ కామెడీ చేేశారు.
జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని కితాబిచ్చిన మధుసూదన్ రెడ్డి…ఆ తర్వాత పంచ్ లు వేశారు. చిరంజీవి కొత్త సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని, అదే తరహాలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందని మధుసూదన్ అనడంతో సభలో నవ్వులు విరిసాయి.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పిన మధుసూదన్ రెడ్డి…ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నో అడ్మిషన్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ తమ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ప్రైవేటుపాఠశాలలపై మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎస్టీ పాఠశాలలు కూడా బెంచీలు, టీవీ సెట్లతో అద్భుతంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్ష నాయకులు వచ్చి చూడాలని కూడా మధుసూదన్ రెడ్డి కోరండం కొసమెరుపు.
This post was last modified on March 11, 2022 8:35 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…