టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై ముఖ్యమంత్రి జగన్ కావాలనే కేసులు పెడుతున్నారని.. అదేసమయంలో మీడియా కూడా తనపై లేనిపోనివి ప్రచారం చేసి…తనను క్రిమినల్ మాదిరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని.. దీంతో తను పెద్ద తప్పుడు నాయకుడినని.. ప్రజలు భావించేలా చేశారని అన్నారు.అయితే..తనేమిటో.. తెలియని వారు ఇలా చేస్తే.. బాధ ఉండేది కాదని. కానీ అన్నీ తెలిసిన మీడియా సహా నాగురించి తెలిసిన.. జగన్ కూడా నాపై కేసులు పెట్టి బద్నాం చేయడం బాధ కలిగించిందన్నారు.
ఈ విషయంలో మా పార్టీ నేతలు.. ఏమనుకున్నా.. పార్టీ అధినేత చంద్రబాబు కూడా తప్పు చేశారని.. అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి ఆయన తప్పులు చేశారన్నారు. అడగకుండానే ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు సిమెంటు రోడ్లు వేయించారని చెప్పారు. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలని.. కానీ.. ఆకలి వేయనివాడికి కూడా అన్నం పెడితే… అతి అయిపోతుందని.. చంద్రబాబు ఇదే చేశారని.. చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో 60 శాతం మెటీరియల్ కాంపొనెంట్ తెచ్చి, 40 శాతం లేబర్ కాంపొనెంట్ తెచ్చి.. రాష్ట్ర విడిపోయిన తర్వాత… ఈ రాష్ట్రాన్ని అలికి ముగ్గు పెట్టాలనని కలలు కన్నారని చెప్పారు.
అయితే.. చంద్రబాబు కన్న కలలను ప్రజలు స్వీకరించలేదని అన్నారు. రోడ్లు వేస్తుంటే.. దానిలో మాకు వాటాలు ఉన్నాయని.. మేం దోచుకున్నామనని.. ఈ ప్రజలు భావించారు. దీనికి కారణం.. మేం అతి చేయడమే. మమ్మల్ని రోడ్డు అడగకుండానే రోడ్డు వేయడం తప్పు కదా?! ఇది మాకు, మా పార్టీకి బుద్ధి వచ్చేలా చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన పనులకు సంబంధించి మాకు, మానాయకులకు ఇప్పటికీ 75 శాతం నిధులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాలకుడు దుర్మార్గుడు కావడంతో మా నాయకులు అనేక మంది చేసినపనులకు సంబంధించి తెచ్చిన సొమ్ముకు.. ఆస్తులు అమ్మి అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో చేసిన పనులను పరిశీలిస్తే.. కాంట్రాక్టర్ మార్జిన్ లేకుండానే చంద్రబాబు ఎస్టిమేషన్లు చేయించా రని తెలిపారు. ఈ పనులు చేస్తే. పార్టీకి, నేతలకు మంచి పేరు వస్తుందని.. భావించి చంద్రబాబు చేసిన పనులతో మేం ఇప్పుడు అప్పుల పాలయ్యాం. మా నాయకులు చెప్పారని.. కాంట్రాక్టర్లు.. అన్నీ వదులుకుని కూడా పనులు చేశారన్నారు. దీంతో నాయకులు ఆర్థికంగా దెబ్బతిని.. తద్వారా.. పార్టీ ఈరోజు దెబ్బతినిపోయిందన్నారు.
This post was last modified on %s = human-readable time difference 3:15 pm
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…