Political News

ఏపీలో రాక్షస పాలన…: ప్రజలకు బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏడాది పాలనపై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తోంటే…టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ ఏడాది పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని…అభివృద్ధి అటకెక్కిందని దుయ్యబడుతున్నారు. వైసీపీ పాలనలో ఏపీలో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని…ఇసుక కొరత మొదలు కరోనా కిట్ల కొనుగోలు వరకు అంతా అవినీతిమయమని విమర్శిస్తున్నారు. జగన్ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలకు బహిరంగ లేఖరాసిన చంద్రబాబు పలు విషయాలు వెల్లడించారు.

దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందని, కానీ, ఏపీలో మాత్రం జగన్ రాసిన రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి రాక్షస పాలన ఎక్కడా చూడలేదని, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఇంతటి విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదని, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అని చంద్రబాబు విమర్శించారు. గత ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని, వైసీపీ నేతల దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు జరుగుతోందని అన్నారు. జగన్ పాలనలో ప్రజలకు చేటు జరుగుతోందని తెలియజేసేందుకే తాను ఈ బహిరంగలేఖ రాస్తున్నానని చంద్రబాబు అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని.. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలు రద్దు చేశారు.. కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తరిమేడయంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు చంద్రబాబు.

వైఎస్సార్‌సీపీ ఏడాది పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపిస్తే టీడీపీపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి విధ్వంసాలకు పాల్పడుతున్నారని.. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బెదిరించి, ప్రలోభపరిచి లొంగదీసుకోవడమే వాళ్ల సిద్ధాంతమన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారని.. నెల్లూరులో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఇళ్లు కూల్చేశారని.. పల్నాడులో భయానక వాతావరణంతో టీడీపీ కార్యకర్తల్ని ఊళ్లలోంచి తరిమేశారని విరుచుకుపడ్డారు.

ఏపీలో గత ఏడాది కాలంలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని..పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపు వంటి చర్యలతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని, కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలనలోని లోపాలను ఎత్తిచూపిస్తే టీడీపీపై కక్షసాధిస్తున్నారని, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రత్యర్థి నేతలను బెదిరించి, ప్రలోభపరిచి, వారి వ్యాపారలను దెబ్బతీస్తామని బెదిరించి లొంగదీసుకోవడమే వైసీపీ సిద్ధాంతమని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రకాశంలో గ్రానైట్‌ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారని, నెల్లూరులో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఇళ్లు కూల్చేశారని, పల్నాడులో భయానక వాతావరణంతో టీడీపీ కార్యకర్తల్ని ఊళ్లలోంచి తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున అండగా నిలుస్తామని అన్నారు.

This post was last modified on June 12, 2020 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

47 mins ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

1 hour ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

2 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

3 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

3 hours ago