Political News

పరిటాల శ్రీరాం జూనియర్ ఆర్టిస్టు: వైసిపి నేత

తెలుగు రాజకీయాల్లో మర్యాదలు పోయి చాలా కాలమే అయ్యింది. తక్షణ రాజకీయ ప్రయోజనం తప్పించి.. విలువలు.. సిద్దాంతాలు.. భౌతికంగా లేని వారిపై విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు చేయకూడదన్న విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. మన మధ్య లేని వారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వచ్చే లాభం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మన మధ్య లేని వాళ్ల మీద ఎంతగా విరుచుకుపడినా.. సదరు వ్యక్తి తన వాదనను వినిపించే వీలు ఉండదు.

ఉన్న వారి వారసులు రియాక్టు అయినా అదంతా సరిగా ఉండదు. తాజాగా  అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాజకీయాల్లో సంచలనంగా చెప్పుకునే పరిటాల రవి మీద ఆయనఘాటు విమర్శలు చేయటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఈ మధ్యన 2019లోపోటీ చేసి ఓడిన రాప్తాడు నుంచి.. ధర్మవరం నియోజకవర్గానికి షిఫ్టుఅయిన పరిటాల శ్రీరాంపై ఆయనఘాటు విమర్శలు చేశారు.

అంతేకాదు.. ఇప్పటివరకు ఎవరూ అనని రీతిలో..పరిటాల శ్రీరామ్ ను జూనియర్ ఆర్టిస్టుగా అభివర్ణించటం గమనార్హం. అంతేకాదు..  పరిటాల రవి మీదా తీవ్ర ఆరోపణలు చేశారు. తమతో పోల్చుకున్న తోపుదుర్తి.. తమ పూర్వీకులు ఎంతటి గొప్పవారో చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘‘పరిటాల శ్రీరామ్.. జూనియర్ ఆర్టిస్టు బాబూ.. మీ నాన్న బతుకు బీడికట్ట.. హవాయి చెప్పులతో మొదైలంది. మా నాన్న పుట్టుకతో శ్రీమంతుడు. మా పూర్వీకులకు 200 ఎకరాల భూమి ఉండేది. మీలా మేం అవినీతి చేసి దోచుకోలేదు. ప్రజాసేవలో మా డబ్బే ఖర్చు చేశాం. పరిటాల శ్రీరామ్ అనే జూనియర్ ఆర్టిస్టుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు’’ అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేయనని చెబుతూ.. ధర్మవరం నుంచి పోటీ చేస్తానని పరిటాల శ్రీరాం చేసిన వ్యాఖ్యను తోపుదుర్తి తప్పుపట్టారు.

‘‘బాబూ జూనియర్ ఆర్టిస్టు..నీ రాజకీయ ఎత్తుగడలు రాప్తాడులో నా వద్ద చూపు. అంతేకానీ.. ధర్మవరం కేతి రెడ్డి వద్ద చూపిస్తే.. ఆయన నా అంత మంచోడు కాదు. ముందు మీ పార్టీలో మీకు టికెట్ ఇస్తారో.. లేదో.. మీ అధినాయకుడు వద్దకువెళ్లి.. తెలుసుకో. ఆ తర్వాత వచ్చి రాజకీయాలు చేయి’’ అంటూ విరుచుకు పడిన వైనం సంచలనంగా మారింది. అంతేకాదు.. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే.. వారికి అన్నిఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో లేక్క చెప్పాలన్నారు.

తాము ఏదో చేశామని చెప్పే పరిటాల శ్రీరామ్.. ఆయన చెప్పే ప్రాంతం అసలు రాప్తాడు పరిధిలోకి రాదన్నారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై వారం.. వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతామన్నారు. తమ చివరి రక్తపు బొట్టు ఉన్న వరకు వైసీపీలోనేఉంటామని స్పష్టం చేశారు. తన తండ్రి పరిటాల రవీంద్ర మీద తోపుదుర్తి చేసిన ఘాటు ఆరోపణలకు శ్రీరాం ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

This post was last modified on January 16, 2022 4:39 pm

Share

Recent Posts

వారికి కాస్త రెస్ట్ ఇవ్వండి ప్లీజ్..

ఉద్యోగుల పని పరిస్థితులు, వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హోటళ్లు,…

8 hours ago

వారికి 66 శాతం రిజ‌ర్వేష‌న్‌

రాజకీయాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్న మాట‌ను నిల‌బెట్టుకుంటామ‌ని ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్య‌క్షుడు వి. విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో…

9 hours ago

సోనియా గాంధీ బయోపిక్ ప్రకటించిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్న బిలాంగింగ్…

9 hours ago

పదేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసిన ఇరుముడి హీరోయిన్!

ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…

10 hours ago

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. గ్రీస్‌లో గ్రాండ్ వెడ్డింగ్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…

10 hours ago

నాగ్ అప్పుడు బాధితుడు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్!

రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…

11 hours ago