ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు నిర్ణయంపై సర్వత్రా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ ధరలు తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్న ధియటర్ల యజమానులు.. వాటిని మూసే స్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేసింది. దీంతో మరిన్ని మూతబడు తున్నాయి. దీంతో ఆయా ధియేటర్లలో పనిచేస్తున్న అన్ని రకాల సిబ్బంది రోడ్డున పడినట్టు అయింది. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
థియేటర్లు మూసివేయడం వల్ల దాని మీద ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉంది. ఇక, టికెట్ల ధరల తగ్గింపుపై కొందరు నటులు గొంతు విప్పగా మరికొందరు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇక, ఇటీవల రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇంతలోనే చర్చకు వెళ్లి మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు. అయితే.. ఈ విషయం ఏం జరిగిందో ఏమో.. 100 శాతం సంతృప్తి అంటూనే మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత.. విమర్శల పరంపర కొనసాగించారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్లు, ధియోటర్ల సమస్యను తాను పరిష్కరిస్తానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చామన్నారు. ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తలసాని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.
సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమ న్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తలసాని పేర్కొన్నారు. ఏపీ సమస్యలపై తాను చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
This post was last modified on January 12, 2022 4:51 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…