Political News

అమెరికా వణికిపోతోందా ?

మళ్ళీ అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో అమెరికా మొత్తంమీద సుమారు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. చాల కాలం తర్వాత ఇన్ని లక్షల కేసులు అమెరికాలో నమోద్దవటంతో సంచలనంగా మారింది. వీరిలో సుమారు 1400 మంది చనిపోవటంతో అగ్రరాజ్యంలో కలకలం మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సుమారు 22 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజ రోజుకు పెరిగిపోతున్నాయట.

సగటున ప్రతిరోజు 10 వేలమంది పెద్దలు, 500 మంది పిల్లాలు కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిల్లో చేరుతున్నారు. మళ్ళీ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రుల బెడ్ల స్ధాయికి మించి రోగులు వచ్చేస్తుండటంతో వారిని చేర్చుకోవటానికి ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఒకపుడు కొలంబియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలే జరగటం అప్పట్లో సంచలనమైంది.

ఆసుపత్రుల్లో బెడ్లు లేక, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ సంఖ్య సరిపోక అప్పట్లో రోగులను చాలా ఆసుపత్రులు చేర్చుకోలేదు. మళ్ళీ అలాంటి పరిస్ధితి అమెరికాలో ఇపుడు కనబడుతోంది. ఒకేరోజు 6 లక్షల కేసులంటే మామూలు విషయం కాదు. ఇపుడు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో, కరోనా బారిన పడుతున్న వాళ్ళల్లో కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు కూడా ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. అంటే టీకాలు వేసుకున్నా కూడా కరోనా వైరస్ నుండి నూరుశాతం రక్షణ రావటం లేదన్నది అర్ధమవుతోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే కోవిడ్ టీకాలు వేయించుకున్నా తాజా వేరియంట్ ఒమిక్రాన్ టీకాను బురిడి కొట్టించి శరీరంలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. కాకపోతే టీకాలు తీసుకోని వాళ్ళమీద చూపించినంత ప్రభావం టీకాలు తీసుకున్న వాళ్ళలో కనబవడటం లేదని కూడా శాస్త్రజ్ఞులు తేల్చారు. కేసులు పెరుగుతున్న కారణంగా అమెరికాలో బూస్టర్ డోసు వేయటాన్ని స్పీడుచేశారు. ఏదేమైనా కరోనా వైరస్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోందంటే యావత్ ప్రపంచం అప్రమత్తమైపోతోంది.

This post was last modified on January 1, 2022 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago