రాజకీయా నాయకులంటేనే విభిన్నమైన ముఖాలకు పెట్టింది పేరు. వాళ్లు బయటకు ఒకలా కనిపించినా లోపల మరొకలా ఉంటారు. పైకా ఎలా మాట్లాడుకున్నా లోపల మాత్రం ఎవరి వ్యూహాలు వాళ్లకు ఉంటాయి. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో అది మరీ ఎక్కువ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డితో పార్టీలోని సీనియర్లకు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా తప్పించాలని జగ్గారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆ లేఖ వెనక మరో సీనియర్ నేత హస్తం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపినిచ్చారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామం నుంచి దాన్ని మొదలెట్టాలనుకున్నారు. కానీ అందుకు అనుమతి లేదని పోలీసులు రేవంత్‌ను ఇల్లు దాటనివ్వలేదు. అయితే తన సొంత జిల్లాలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం గురించి తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేవంత్ వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం పని చేస్తున్నారని, ఆయన వైఖరి మార్చుకోకుంటే టీపీసీసీ అధ్యక్షుడిగా మరొకరిని నియమించాలని కోరుతూ జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. అయితే లేఖ రాసింది జగ్గారెడ్డి అయినా ఆయన వెనక ఎవరు ఉన్నారనే విషయంపై రేవంత్ అండ్ టీమ్ ఆరా తీయడం మొదలెట్టిందని సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ వెనక నల్లగొండ ఎంపీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఉన్నారని రేవంత్ వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోందని టాక్.
ఉత్తమ్ ప్రోద్బలం కారణంగానే జగ్గారెడ్డి ఏకంగా రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పార్టీలోని సీనియర్లను రేవంత్ కలుపుకోని పోవడం లేదని ఉత్తమ్ ఓ సారి అసంతృప్తి వెళ్లగక్కాడు. అంతే కాకుండా రేవంత్ సైన్యం పేరుతో సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారంపై గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి వివరించారు. దీనిపై హైకమాండ్ రేవంత్‌ను వివరణ కూడా కోరిందని సమాచారం. మరి ఈ వర్గపోరుకు ఎప్పుడు ఏ విధంగా ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
This post was last modified on December 31, 2021 4:06 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…