ఏపీలో ఖాళీగా ఉన్న ఇన్చార్జ్ పదవులను పార్టీ అధినేత చంద్రబాబు వేగంగా భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై కూడా ఆయన సమీక్షించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్చార్జి పదవులను భర్తీ చేస్తున్న బాబు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు – చింతలపూడి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలుగా ఎవరిని ఎంపిక చేస్తారా ? అన్న ఆసక్తి జిల్లా రాజకీయ వర్గాల్లో ఉంది.
మెట్ట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కర్రా రాజారావు మృతిచెందారు. దీంతో ఇప్పుడు ఇక్కడ కొత్త నేతను ఎంపిక చేయాల్సి ఉంది.
ఇన్‌చార్జ్ రేసులో ముగ్గురు…
ప్రస్తుతం ఉన్న సమీకరణాలను బట్టీ చూస్తే మాజీ మంత్రి పీతల సుజాత తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు ప్రధానంగా రేసులో ఉన్నారు. వీరిలో సుజాత, జయరాజు మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు… కాగా రామారావు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురు కూడా ఇన్చార్జి పదవి తమకు దక్కుతుందని ధీమాతో ఉన్నారు. చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు.
సుజాతకు సీనియార్టీ + మహిళా కోటా బలం:
పీతల సుజాత గతంలో ఆచంట నుంచి 2014లో చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేయడంతో పాటు మాల వర్గంలో మహిళా నేతగా ఉండటం.. పార్టీ ఎప్పుడు టికెట్ నిరాకరించినా పార్టీ వీడకుండా కమిట్ మెంట్ తో పనిచేయడం సుజాతకు కలిసి వచ్చే అంశాలు. అయితే గత ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో సుజాతను వ్యతిరేకిస్తున్న వర్గం ఆమెకు టికెట్ రాకుండా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. అదే వర్గం ఇప్పుడు ఆమెను వ్యతిరేకిస్తోంది. మరి దీనిని ఎదుర్కొని ఆమె ఎలా నిలబడతారో ? చూడాలి. అయితే ఆమె తన వర్గం నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నారు.
20 ఏళ్ల జయరాజు కల నెరవేరేనా…!
జడ్పీ మాజీ చైర్మన్ జయరాజు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం గత మూడు ఎన్నికల్లోనూ విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. 2009 – 2014- 2019 ఎన్నికల్లో ఆయన చింతలపూడి టిక్కెట్టే ప్రధానంగా ట్రై చేసినా మూడు సార్లు ఆయన ప్రయత్నం ఫలించలేదు. గత ఎన్నికలకు ముందు నుంచి కూడా చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ నాయకులకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడినా కూడా కేడర్ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. అయితే జయరాజుకు సీటు రావాల్సి వస్తే గతంలోనే వచ్చేది.. మరి ఇప్పుడు కూడా ఆ గండం ఎలా దాటతారు ? అన్నది సస్పెన్స్.
ఆకుమర్తి ఆశలు ఈసారైనా ఫలించేనా ..!
ఇక నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీకి చెందిన పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు పార్టీలో సుధీర్ఘకాలంగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా సీటు కోసం ప్రయత్నాలు చేశారు. నారా లోకేష్ సేవా సమితి ద్వారా నియోజకవర్గంలోనే కాకుండా.. మెట్ట ప్రాంతంలో పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేష్ ప్రశసంలు కూడా పొందారు. గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోయినా.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో లీడ్ తీసుకుంటున్నారు. కేడర్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉండే ఆర్థిక సాయం చేయడంతో పాటు తక్షణమే స్పందిస్తున్నారు. గోపాలపురం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో రైతులతో విస్తృతంగా ఉన్న పరిచయాలు ప్లస్ పాయింట్. అయితే మిగిలిన ఈక్వేషన్లు ఆయనకు కలిసి వస్తాయా ? అన్నదే చూడాలి.
ఇక పార్టీకి నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ లేకపోవడంతో అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో ఎవ్వరూ ముందుండి లీడ్ తీసుకోవడం లేదు. ఈ విషయంలో కేడర్ కూడా తలోదారి ఉన్నారు. ఇన్‌చార్జ్ ఎవ్వరూ లేకపోవడంతో కొందరు కొత్త పిచ్చోళ్లు ( చివరకు ఓసీ క్యాండెట్లు కూడా) ఇన్‌చార్జ్ తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటకి అయినా అధిష్టానం ఇక్కడ ఇన్‌చార్జ్ పదవి భర్తీ చేస్తే ఆ నేత ఆధ్వర్యంలో కలిసి కట్టుగా పోరాటం చేసేందుకు వీలు ఉంటుందని పార్టీ కేడర్ భావిస్తోంది.
This post was last modified on December 29, 2021 12:52 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…