ప్రముఖ నటుడు ప్రభాస్ పై తెలంగాణ రెవెన్యూ అధికారి కేసు పెట్టారు. కేసు ఏంటో తెలుసా? ప్రభాస్ తన గెస్టు హౌస్ లోకి తాను వెళ్లినందుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఈ కేసు పెట్టారు. అదేంటి ప్రభాస్ తన గెస్ట్ హౌస్ తాను వాడితే కేసు పెట్టడం ఏంటి? అనుకుంటున్నారా… ఇక్కడో ట్విస్ట్ ఉంది.
2200 గజాల్లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ ప్రభాస్ దే కానీ అది నిర్మించిన స్థలం మాత్రం వివాదంలో ఉంది. రాయదుర్గం పరిధిలోని 46వ సర్వే నెంబరులో 84 ఎకరాల 30 గుంటల భూమిపై నలభై సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబరులో ప్రభాస్ తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అదేంటి 40 ఏళ్ల నుంచి వివాదం నడుస్తుంటే… ఇటీవల ఆయనలా అక్కడకు పోయి కట్టుకున్నాడనేది మరో సమస్య.
సీజ్ చేసిన గెస్ట్ హౌస్ లోకి లాక్ డౌన్ సమయంలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అంటూ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రభాస్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. చాలారోజుల క్రితమే గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి అది ప్రభుత్వం స్థలం అన్నది రెవెన్యూ అధికారుల వాదన. దీనిని ఆల్రెడీ నోటిఫై కూడా చేశారు. అయితే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గతంలోనే ప్రభాస్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదింకా పెండింగ్ లో ఉంది. ఈ కేసు ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టు మెట్లెక్కింది.
This post was last modified on June 9, 2020 8:03 pm
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…