“బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ అవకాశం దక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన బ్రిటిష్ పాలన 2.0 మాదిరి ఉంది.” అని టీడీపీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తాజాగా తిరుపతి వేదికగా.. అమరావతి రైతులు మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కోర్టు అనుమతిచ్చింది. అయితే.. ప్రజలు సభకు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ పరిణామాలపై టీడీపీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని టీడీపీ ప్రశ్నించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటన జారీ చేశారు. “జగన్ రెడ్డి 3 రాజధానులు కడతానని చెప్పి 3 సంవత్సరాలు కావొస్తోంది, ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో కనీసం 3 ఇటుకలు కూడా పేర్చలేదు, తప్పుడు ప్రచారంతో అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేకూర్చారు” అని నిప్పులు చెరిగారు.
అమరావతే రాజదానిగా కావాలంటూ రైతుల చేస్తున్న పాదయాత్రను అడగడుగునా అవమానిస్తూ..అడ్డంకులు కల్పించినా.. రైతుల పాదయాత్ర విజయవంతం కావడంతో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కడుపు మంటతో బాధపడుతున్నారని అన్నారు. అందుకే తిరుపతి అమరావతి బహిరంగ సభకు కోర్టు అనుమతిచ్చినా.. ఎక్కడిక్కక అడ్డంకులు సృష్టిస్తూ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయమన్నందుకు అన్యాయంగా అరెస్టు చేయటం సిగ్గుచేటు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోలవరం నిర్వాసితులు 10 రోజుల నుంచి నిరవదిక దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు?” అని నిలదీశారు.
ముఖ్యమంత్రికి టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయటంపై ఉన్న శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై లేకపోవటం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలనువటం మూర్కత్వం. మీరు ఎంతమందిని హౌస్ అరెస్టులు చేసినా, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామని అన్నారు. ప్రజా గొంతుకై నినదిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
This post was last modified on December 17, 2021 6:40 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…