ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కారు ఎక్కడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 3న ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం కోర్టు ముందు చార్జ్‌షీట్ సమర్పించింది.
ఇందులో రైతులపైకి ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించారని ఇది కావాలని పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. ఇందులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. దీంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంతో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనను సిట్ చార్జ్‌షీట్ గురించి మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
దీంతో మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సదరు జర్నలిస్టును దుర్భషలాడుతూ దాడికి సైతం పాల్పడ్డారు. దిమాగ్ కరాబ్ హై క్యా బే(మెదడు పాడైందా ఏమి), మైక్ బంద్ కర్ బే(మైక్ కట్టెయ్), చోర్ (దొంగలు).. అంటూ బూతులు తిడుతూ ప్రశ్నించిన జర్నలిస్ట్ చేతిలో నుంచి మైక్‌ను లాగి బయటికి విసిరేశారు. రిపోర్టర్ ఏమీ చేయలేక అలా నిల్చునున్నాడు. అయినప్పటికీ అజయ్ మిశ్రా కోపం తగ్గలేదు.
జర్నలిస్ట్‌ను బూతులు తిడుతూనే అతడిని పలుమార్లు వెనక్కి బలంగా తోశారు. అక్కడే ఉన్న పోలీసులు కేంద్ర మంత్రిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ మిశ్రా రాజీనామా చేయాలంటూ నినదిస్తున్నారు. కొడుకు నిర్వాకంపై ప్రశ్నిస్తే బీజేపీ కేంద్రమంత్రి పిచ్చి వేషాలు వేస్తున్నాడని కేంద్రమంత్రిని బట్టలుడ దీసి తన్నాలి అంటూ నెటిజన్లు, రైతులు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేస్తున్నారు.
This post was last modified on December 16, 2021 12:09 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…