టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా సూపర్ హిట్ రేంజ్ సాధించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తాను కూడా ఈ సినిమా చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ సినిమా చూస్తే చాలని హీటెక్కించే వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో “అఖండ” సినిమా చూస్తే అర్థమవుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు.. అఖండ సినిమా అద్దం పడుతోందని ఆయన చెప్పారు.
మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. తాను కూడా “అఖండ” సినిమా చూశానని చంద్రబాబు వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీ ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. నిజానికి చంద్రబాబు సినిమాలు చూసే సమయం చాలా చాలా తక్కువ. అయితే.. ఇటీవల కాలంలో కొంత ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో ఆయన అఖండ సినమాను రిలాక్స్ కోసం చూసినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు. ముఖ్యంగా బాలయ్య నటన అఘోరాగా అద్భుతంగా ఉందని కీర్తించారు. తాను ఊహించలేదని.. అంతబాగా నటించారని పేర్కొన్నారు. దర్శకుడు బోయపాటి.. మంచి ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని.. ప్రజలు ఇప్పటికైనా.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలపై దండెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on December 11, 2021 7:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…