ఏపీ ప్రదాన ప్రతిపక్షం టీడీపీ గురించి ఒక చిత్రమైన టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయి.. రెండు న్నరేళ్లు అయిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరమైన పరాజయాన్నే చవి చూసింది. కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో పార్టీ అనేక రూపాల్లో ఉద్యమాలు చేసింది. అధికార పార్టీ వైసీపీపై దూకుడుగా వ్యవహరించింది. చంద్రబాబు కూడా పార్టీని నిలబెట్టుకునేందుకుఅనేక రూపాల్లో ఆందోళన చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు.. ఆయన స్వయంగా దీక్షకు కూర్చున్నారు. అదేసమయంలో ప్రజల సమస్యలపైనా దండెత్తారు.
ఇక, చంద్రబాబు తన కుమారుడు, పార్టీ యువనేత లోకేష్‌ను క్షేత్రస్థాయిలోకి పంపించారు. ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా.. పరిశీలించి.. వారికి సాయం అందించే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే.. ఇంత జరిగినా.. పార్టీలో కొత్త ఊపు కనిపించలేదనేది ప్రధాన వాదన. ఎంత ప్రయత్నం చేసినా..పార్టీలో ఊపు తీసుకురాలేక పోతున్నారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ప్రధానంగా.. వైసీపీ ప్రభు త్వం తీసుకువస్తున్న పలు పథకాలతో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వంపై ఒక విధమైన వ్యతిరేక కూడా ఏర్పడుతోందనే వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలోప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేసి నా.. అనుకున్న విధంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత.. టీడీపీకి అనుకూలంగా మారడం లేదని.. రాజకీ య నేతలు చెబుతున్నారు. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని చెబుతున్నాయి.
1. నేతల్లో నెలకొన్న అనుమానం(ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా?)
2. వైసీపీ నేతలతో తెరచాటు స్నేహం
3. అధినేత పట్ల నమ్మకం లేకపోవడం
4. క్షేత్రస్థాయిలో నాయకత్వ లోపాలు
5. ఆర్థికంగా క్షేత్రస్థాయిలో సమస్యలు
ఈ ఐదు కారణాలే.. టీడీపీని ఇరుకున పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఆయా విషయాలపై చంద్రబాబు దృష్టి పెట్టకుండా.. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామనే ధీమా కల్పించడంలో పార్టీ అధినాయకత్వం విఫలమవుతోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఇప్పటికైనా..ఈ ఐదు అంశాలపై చంద్రబాబు.. దృష్టిపెట్టి సరిచేస్తే.. తప్ప పార్టీ గాడిన పడడం సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 13, 2021 2:03 pm
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…
వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార…
తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ…
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల కోసం అటు అధికార…
యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో…
కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో…