పార్టీలో కొత్త రక్తం ఎక్కించేందుకు చంద్రబాబునాయుడు 6 నెలలను డెడ్ లైనుగా పెట్టుకున్నారు. కుప్పం మున్సిపాలిటి ఓటమిపై కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు పార్టీ బోలోపేతానికి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పంలోనే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయని నేతలను మార్చేస్తానని స్పష్టంగా చెప్పారు. పార్టీ నేతలను మార్చటానికి రెండు పాయింట్లమీదే ఫోకస్ చేయబోతున్నట్లు చెప్పారు. అవేమిటంటే ఇతర పార్టీల్లోని నేతల తరపున టీడీపీలో ఉన్న కోవర్టులను ఏరేయటం.
రెండో పాయింట్ ఏమిటంటే పార్టీలోనే ఉంటు పార్టీ విజయానికి వెన్నుపోట్లు పొడుస్తున్న నేతలను గుర్తించి ఏరేయటం. నియోజకవర్గాల్లో ఎక్కడేమీ జరుగుతోందో తనకు పూర్తి సమాచారం ఉంది కాబట్టి కొత్తరక్తం కోసం తొందరలోనే యాక్షన్ ప్లాన్ మొదలుపెడతానని ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీకి ఉన్న మైనస్ పాయింట్లు ఏమిటనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే వాటిని అధిగమనించలేకపోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా చాలామంది ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత ఉందని స్వయంగా చంద్రబాబే చెప్పారు.
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల స్థానంలో కొత్తవాళ్ళకు టికెట్లిస్తానని చాలాసార్లు చెప్పారు. కానీ చివరకు ఏమైందంటే జనాల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళకే మళ్ళీ టికెట్లిచ్చారు. సరే ఓవరాల్ గా పార్టీ గెలుపోటములునేది ఒక ఎంఎల్ఏపై జనాల్లో ఉన్న వ్యతిరేకత డిసైడ్ చేయదు. కానీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల సంఖ్య పెరిగిపోతోందంటే పార్టీ అధినేత కచ్చితంగా ఆ విషయంపై సీరియస్ గానే ఆలోచించాలి. కానీ చంద్రబాబు ఆ పని ఎప్పుడూ చేయరు. ఇపుడు కూడా పార్టీకి కొత్తరక్తం ఎక్కిస్తానని ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. ఇదంతా విని విని నేతలకు కూడా విసుగొచ్చేసింది.
ఎందుకంటే గట్టి ఇన్చార్జీలు లేని నియోజకవర్గాలు కనీసం 80 ఉంటాయి. మిగిలిన జిల్లాల సంగతిని వదిలేసినా సొంత జిల్లా చిత్తూరులో కొన్ని నియోజకవర్గాలకు రెండున్నరేళ్ళుగా ఇన్చార్జి లేరు. ఇపుడు కొత్తరక్తం అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో సీనియర్ నేతల వారుసులే అన్నట్లుగా ఉంది. సీనియర్ల మీదున్న వ్యతిరేకత వాళ్ళ వారసులపైన ఉండదా ? నిజానికి సీనియర్ల తరపున వారుసులే కదా నియోజకవర్గాల్లో వ్యవహారాలను చక్కపెడుతున్నది. కాబట్టి కొత్త యువకులను ప్రోత్సహిస్తేనే కొత్తరక్తం ఎక్కించినట్లవుతుంది కానీ వారసులకు పదవులిస్తే కొత్త రక్తం ఎలాగవుతుంది?
This post was last modified on %s = human-readable time difference 10:03 am
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…