Political News

ఈ రోజు నుంచి గుళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్ ఓపెన్.. రూల్స్ ఇవే

అన్ లాక్ 1.0లో భాగంగా ఈ రోజు నుంచి గుళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్ ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్ని పక్కాగా పాటించాలని చెబుతున్నారు.

తెలంగాణలోని ప్రార్థనాలయాలు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. షాపింగ్ మాల్స్ ను తెరుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏమేం రూల్స్ ను పాటించాలనే అంశంపై స్పష్టత ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి నిబంధనలు ఉంటాయన్నది తాజా రూల్స్ వెల్లడిస్తున్నాయి.

ప్రార్థనా స్థలాల్లో ఏమేం పాటించాలంటే..

  • ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లటానికి ముందే చేతులు.. కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి
  • కాళ్లు.. చేతులు కడుక్కునే స్థలంలో పరిశుభ్రతను పాటించాలి
  • చెప్పుల స్టాండ్ ను ఏర్పాటు చేయాలి
  • ఒకేచోట ఎక్కువ మంది గుమిగూడటానికి వీల్లేదు
  • క్యూలు నిర్వహణకు పేపర్ టోకెన్లు వినియోగించాలి
  • మనుషుల్ని తాకేలా ప్రసాదాలు.. తీర్థాలు లాంటివి ఇవ్వకూడదు
  • ఎక్కడా కాంటాక్టు అన్నది ఉండని రీతిలో ఏర్పాట్లు ఉండాలి
  • భౌతిక దూరం పాటించేలా క్యూ వరసలు ఉండాలి
  • విగ్రహాలు.. పుస్తకాలతో సహా వేటిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • అందరూ కలిసి ప్రార్థనలు చేసుకునేలా కామన్ మ్యాట్లను వాడకూడదు
  • భక్తులు ఎవరికి వారు తమ మ్యాట్లను తీసుకురావాల్సి ఉంటుంది
  • అన్నదాన కేంద్రాల వద్ద సామాజిక దూరాన్ని విధిగా పాటించాలి

హోటల్స్ దగ్గర ఏమేం రూల్స్ అంటే..

  • హోటల్స్ లో రూములు తీసుకునే గెస్టులు తమ గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది
  • ట్రావెల్ హిస్టరీ.. మెడికల్ హిస్టరీ అన్ని తెలుసుకున్న తర్వాతే రూమ్ ఇవ్వాలి
  • అతిథులు సామాజిక దూరం పాటించేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి
  • రిసెప్షన్ వద్ద తప్పనిసరిగా శానిటైజర్ ఉంచాలి
  • చెక్ ఇన్.. చెక్ ఔట్ల కోసం వీలైనంతవరకు ఆన్ లైన్ లోనే పూర్తి చేయాలి
  • పేమెంట్లు సైతం ఆన్ లైన్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి (వీలైనంతవరకు)
  • హోటల్ కు వచ్చే అతిధులే కాదు.. సిబ్బంది సైతం తప్పనిసరిగా మాస్కులు.. ఫేస్ కవర్లు.. శానిటైజర్లను వాడాలి
  • హోటల్ నుంచి గెస్టు వెళ్లిన తర్వాత కూడా రూమ్ ను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి
  • రూమ్ సర్వీస్ సైతం సామాజిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

రెస్టారెంట్ల దగ్గర నిబంధనలివే..

  • వీలైనంతవరకు టేక్ అవేలను ప్రోత్సహించాలి
  • హోం డెలివరీ చేసే వ్యక్తికి థర్మల్ స్క్రానింగ్ తప్పనిసరి
  • ఫుడ్ ప్యాకెట్లు ఇంటి గుమ్మం వద్దే ఉంచాలి. చేతికి ఇవ్వకూడదు
  • రెస్టారెంట్లలో సీట్ల కెపాసిటీలో 50 శాతం కంటే ఎక్కువ మందిని అనుమతించకూడదు
  • సామాజిక దూరం పాటించేలా సిబ్బందిని నియమించాలి
  • వాడి పారేసేలా వస్తువుల్ని వినియోగించటం మంచిది
  • క్లాత్ నేప్ కిన్స్ స్థానంలో పేపర్ నేప్ కిన్లు ఇవ్వాలి
  • బఫెట్ సర్వీసు ఉన్న చోట సామాజిక దూరం అవసరం
  • వెయిటర్లు.. ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు.. ఫేస్ కవర్లు వాడాలి
  • కస్టమర్ వెళ్లి వెంటనే మరో కస్టమర్ ను రానివ్వకుండా.. వారు కూర్చున్న ఫర్నీచర్ ను శానిటైజ్ చేయాలి
  • కిచెన్ స్టాప్ శానిటైజేషన్ పాటించాలి.. కిచెన్ పరిశుభ్రంగా ఉండాలి

మాల్స్ కు రూల్స్ ఇవే

  • సామాజిక దూరం పాటించేలా చేయటం కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలి
  • హోం డెలివరీ చేసేందుకు వెళ్లే వారిని ముందుగా థర్మల్ స్క్రానింగ్ తప్పనిసరి
  • షాపులో ఒకే సమయంలో ఎక్కువమంది కస్టమర్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • మాల్ లో చెత్తను పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • మాల్స్ లో బట్టలు కొనే వారికి ట్రయల్స్ కు అనుమతి ఇవ్వకూడదు.

This post was last modified on June 8, 2020 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

41 minutes ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

52 minutes ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

2 hours ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

2 hours ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

3 hours ago