కేంద్రం మీద యుద్ధమన్నారు.. ఆకాశం బద్దలైపోతుందన్నారు. జనాలంతా నిజమే అనుకుంటే తీరా ఇంకేదో అయ్యింది. వరికి ప్రత్యామ్నాయ పంటలుగా వేరుశెనగ, పత్తి, మినుములు, పెసర, శనగల్లాంటి పంటలపై రైతులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీయార్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి రైతులతో ముచ్చట్లాడారు. సంవత్సరమంతా వరి వేసి ఇబ్బందులు పడే బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును కూడా ఆలోచించాలన్నారు.
వరి కొనుగోలు విషయంలో కేంద్రంపై కేసీయార్ నోటికొచ్చినట్లు విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా పండిన వరిని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదో చూస్తానంటూ రంకెలేశారు. తెలంగాణలో వరిని కేంద్రం కొనుగోలు చేసి తీరాల్సిందే అంటూ తీవ్రంగానే వార్నింగ్ ఇచ్చారు. కేసీయార్ వార్నింగుపై కేంద్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వక పోయేసరికి మంత్రులు, నేతల బృందాన్ని వేసుకుని ఏకంగా ఢిల్లీకే వెళ్ళిపోయారు.
అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు. మూడు రోజులు ఢిల్లీలోనే కేసీయార్ వెయిట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని కేసీయార్ చివరకు హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. కేంద్రమేమో రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించేసింది. ఇదే సమయంలో కేసీయార్ మాత్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అంటు పట్టుబట్టారు.
వరి రాజకీయంపై దాదాపు పది రోజులు కేసీయార్-బీజేపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. బాయిల్డ్ రైస్ ను తెలంగాణా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు నానా రచ్చచేశారు. కేంద్రం తెలంగాణాపై సవతి తల్లి ప్రేమను కురిపిస్తోందంటు కేసీయార్ అండ్ కో నానా గోల చేశారు. ఇదే సమయంలో కేసీయార్ ను టార్గెట్ చేస్తు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో ఇందిరాపార్క్ దగ్గర పెద్ద సీనే క్రియేట్ చేశారు.
వరి చుట్టూ పెద్ద రాజకీయమే నడవటంతో తెలంగాణలో ఏదో జరగబోతోందనే అనుకున్నారు. తీరా చూస్తే వరికి ప్రత్యామ్నాయ పంటలను వేయాలని కేసీయార్ రైతులకు చెప్పటంతో కేంద్రం మీద యుద్ధం అయిపోయినట్లే అనిపిస్తోంది. ఇంతోటి దానికి రైతులను రెచ్చగొట్టడం, యుద్ధమని ప్రకటించటం, ఇందిరా పార్కు దగ్గర స్వయంగా కేసీయారే దీక్ష చేయటం, అపాయిట్మెంట్ లేకపోయినా ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు కూర్చోవడం లాంటివి ఎందుకు చేసినట్లో ఎవరికీ అర్థం కావడం లేదు.
This post was last modified on December 3, 2021 11:29 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…