మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయం మీద గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రంపై పెద్ద ఎత్తున విరుచుకుపడటం తెలిసిందే. తమ మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సూటి ప్రశ్నతో కేసీఆర్ మాటల్లోని డొల్లతనాన్ని తేల్చేశారు. మెడపై కత్తి పెట్టి రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారన్న ఆయన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్.. ‘మెడపై కత్తి పెడితే నీ సీఎం పదవిని.. నీ ఫాంహౌస్ ను రాసిస్తవా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర రైతుల ప్రయోజనాల్ని కేంద్రానికి ఎలా కట్టబెడతావ్ అంటూ మండిపడ్డ ఆయన.. ‘నీ మెడపై కత్తి పెట్టగానే బియ్యం ఇవ్వనని ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నావా? ధాన్యం కొనుగోళ్లు చేసేలా కేసీఆర్ జంతర్ మంతర్ లో దీక్ష చేయాలి. కేసీఆర్ సచ్చుడో.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసుడో తేల్చుకోవాలి. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ఉద్యమాలు చేస్తాం. బీజేపీ.. టీఆర్ఎస్ లు చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణరైతాంగాన్ని మోసం చేస్తున్నాయి’ అంటూ మండిపడ్డారు.
రైతుల ఇబ్బందుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. లోక్ సభలో ఉన్న తొమ్మిది మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు (కొత్త ప్రభాకర్ రెడ్డి.. కవిత.. దయాకర్) సభకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మరిన్ని ప్రశ్నల్ని ఆయన సంధించారు. ‘‘రాష్ట్రంలో వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చేతగానితనాన్ని ప్రదర్శిస్తుంటే.. ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావు? రైతు బాంధవున్ని అంటావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులను ఆదుకుం టున్నా అంటావ్. మరి ఇప్పుడు కేంద్రం బియ్యం కొననంటే.. రైతులను ఆదుకునేలా నీ కార్యాచరణ ఏమిటి?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.
తన పదునైన వ్యాఖ్యలు.. అంతకుమించిన లాజిక్ తో రాజకీయ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ తాజాగా సంధించిన పదునైన వ్యాఖ్యను తన ప్రశ్నాస్త్రాలతో సింఫుల్ గా తీసి పారేశారని చెప్పాలి. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో ’అంటూ తాను చేసిన దీక్ష తోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుతో పోరుకు రేవంత్ విసిరిన సవాలుకు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on December 1, 2021 11:29 am
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…