Political News

ఏపీ తెలంగాణ ప్రజలు ఇక దర్జాగా ఊరెళ్ళి పోవచ్చు

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణల మధ్య సరిగ్గా రెండున్నర నెలల క్రితం స్వేచ్ఛా ప్రయాణాలు బంద్ అయ్యాయి. అత్యవసరాలకు మాత్రమే ఇరు రాష్ట్రాలు ప్రజలను అనుమతించాయి. అయితే, కొద్దిరోజుల క్రితమే దేశంలో తెలంగాణ నుంచి వెళ్లడానికి, తెలంగాణకు రావడానికి ఎటువంటి పాసులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే… ఏపీ లో మాత్రం పాసు లేకుండా అనుమతించం, క్వారంటైన్ తప్పదు వంటి నిబంధనలు పెట్టడంతో తెలంగాణ స్వేచ్ఛ ఇచ్చినా ఏపీకి చెందిన హైదరాబాదీయులు ఇళ్లకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు.

ఈరోజు ఏపీ ప్రభుత్వం కూడా చెక్ పోస్టులను, నిబంధనలు ఎత్తేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు బాగా పుంజుకోనున్నాయి. బడులు లేకపోవడం, వర్క్ ఫ్రం హోమే కావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్దామని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇన్నాళ్లకు ఇరు ప్రభుత్వాలు కరుణించడంతో ఇక నుంచి ఏపీ – తెలంగాణ మధ్య విస్తృతంగా రాకపోకలు పున:ప్రారంభం కానున్నాయి.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగించాలా వద్దా అనే విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. దీంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా స్పందిస్తోంది. ఇప్పటికీ మన పక్కనున్న కర్ణాటక ఇతర రాష్ట్రీయులను అనుమతించడం లేదు.

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలు మందగించాయి. చాలామంది హైదరాబాదులో ఉన్న ఏపీ వారికి వ్యవసాయ వ్యవహారాలు కూడా ఏపీలో ఉన్నాయి. ఇంకా విద్యా పరమైన అవసరాలు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువే. పాలనా పరంగా మాత్రమే ఇవి రెండు రాష్ట్రాలు గాని ప్రజల్లో ఆ భావన లేదు. అందుకే ప్రయాణ నిబంధనలు అన్నిటికీ అడ్డంకిగా మారడంతో ఏపీ కూడా చొరవ తీసుకుని నిబంధనలు ఎత్తివేసింది. ఇక నుంచి హ్యాపీ జర్నీ.

This post was last modified on %s = human-readable time difference 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కంగువని వెంటాడుతున్న థియేటర్ టెన్షన్లు

రేపు విడుదల కాబోతున్న కంగువకు కష్టాల పరంపర కొనసాగుతోంది. తమిళనాడులో అమరన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మూడో వారంలోనూ…

50 mins ago

జీబ్రాకు ఊపు తీసుకొచ్చిన మెగాస్టార్

వచ్చే వారం నవంబర్ 22 విడుదల కాబోతున్న జీబ్రాని సత్యదేవ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సోలో హీరోగా బ్లఫ్ మాస్టర్…

2 hours ago

రాబిన్ హుడ్ అంటే చిరంజీవి కొండవీటి దొంగే

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ డిసెంబర్ విడుదలకు రెడీ అవుతోంది. తొలుత 20 డేట్…

4 hours ago

మ‌రో వారంలో మ‌హాయుద్ధం.. గెలుపెవ‌రిది?

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ వ‌చ్చే బుధ‌వారం(న‌వంబ‌రు 20) జ‌ర‌గ‌నుంది. అంటే.. ప్ర‌చారానికి ప‌ట్టుమ‌ని 5 రోజులు మాత్ర‌మే ఉంది.…

5 hours ago

అమరన్ అద్భుత ఆదరణకు 5 కారణాలు

మాములుగా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఒక వారం రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే బ్లాక్ బస్టర్ గా…

5 hours ago

NBK 109 టైటిల్ – బాలయ్య ఓటు దేనికి ?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న బాలయ్య 109 టైటిల్ టీజర్ ఈ వారమే విడుదల కానుంది. ఉదయం 10…

8 hours ago