Political News

అమరావతి అడుగులు ఇలా… 2014 టు 2021

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అమరావ‌తిని వికేంద్రీక‌రిస్తూ మూడు రాజ‌ధానులు చేశారు. ఇక ఈ రోజు మూడు రాజ‌ధానుల‌ను ర‌ద్దు చేస్తూ మ‌రోసారి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అస‌లు అమ‌రావ‌తి రాజ‌ధానిగా 2014 – 2021 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఏం జ‌రిగిందో ఓ సారి చూద్దాం.

  • 2014లో న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ ఏర్ప‌డి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే అమ‌రావ‌తి రాజ‌ధాని అని నాటి టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
  • 2014 డిశంబ‌ర్ 31 సీఆర్డీయే చ‌ట్టానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.
  • అమ‌రావ‌తిలో మొత్తం 217 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో రాజ‌ధాని ప్రాంతంగా గుర్తించారు.
  • రాజధాని కోసం 54 వేల ఎకరాల ప్రభుత్వ, రైతుల భూముల సమీకరించాల‌ని అనుకున్నారు.
  • మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాల్లో సీఆర్డీయే ప‌రిధి విస్త‌రించి ఉంది.
  • 2015 అక్టోబ‌ర్ 22వ తేదీ ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా అమ‌రావ‌తి శంకుస్థాప‌న జ‌రిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు.
  • నాలుగేళ్ల కాలంలో రు. 7200 కోట్ల‌తో నిర్మాణాలు, రోడ్లు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్ప‌డ్డాయి.
  • 2019 డిశంబ‌ర్ 17వ తేదీన మూడు రాజ‌ధానులు అంటూ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.
  • మంత్రులు క‌మిటీ, బోస్ట‌న్ క‌మిటీ. జిఎన్ రావు క‌మిటీ నివేదిక‌ల ఆధారంగా రాజ‌ధానిని వికేంద్ర‌క‌రిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం చేసింది.
  • 2020 జ‌న‌వ‌రిలో సీఆర్డీయే ర‌ద్దు, పాల‌నా వికేంద్ర‌క‌ర‌ణ పేరిట మూడు రాజ‌ధానుల‌ బిల్లులు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. బిల్లు శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందింది.
  • ప్ర‌భుత్వ బిల్లును శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్షం అడ్డుకుంది. ఇక్క‌డ బిల్లు ఆమోదం పొంద‌లేదు.
  • మండలి ప‌రిణామాల‌పై ఆగ్ర‌హంతో జ‌గ‌న్ ఏకంగా మండ‌లినే ర‌ద్దు చేస్తూ తీర్మానం చేశారు.
  • ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై రైతులు, రాజ‌కీయ ప‌క్షాల నేత‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు.
  • రెండేళ్లుగా రాజ‌ధానిపై కోర్టులో విచార‌ణ సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వం చ‌ట్టాల‌పై గ‌తంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది.
  • ఇక అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో రైతులు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.
  • స‌డెన్ ట్విస్టుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల బిల్లు, సీఆర్డీయే ర‌ద్దు బిల్లును క్యాన్సిల్ చేస్తున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

మ‌రి ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ? కాల‌మే చెపుతుంది.

This post was last modified on %s = human-readable time difference 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును మద్దుపెట్టబోయిన మహిళ..వైరల్ వీడియో

ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…

3 hours ago

వైట్ హౌస్ కూడా రుషికొండ ప్యాలెస్ లా లేదు: చంద్రబాబు

విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

కంటెంట్ ఉంది.. సింపతీ కలిసొచ్చింది

దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…

3 hours ago

దయ్యం ముందు సూపర్ స్టార్లు దిగదుడుపు

ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…

3 hours ago

ఏంది బ్రో అంత మాట అన్నావు…

తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌ప‌ట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజ‌కీయం అంతా అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య జ‌రుగుతుంద‌నుకుంటున్న త‌రుణంలో…

6 hours ago

దీపావళి 2024 విజేత ఎవరు

పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…

6 hours ago