కేసీఆర్ వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. ప్రత్యర్థులు అర్థం చేసుకునే లోపే ఆయన తన పనిని పూర్తి చేస్తారు. ఎవరికీ అంతుచిక్కకుండా ఆయన వ్యూహాలుంటాయి. చివరికి గులాబీ పార్టీ నేతలకు కూడా ఆయన చిక్కరు. అంతా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్యత్తును ఇప్పుడే అంచనా వేసి పావులు కదపడంలో కేసీఆర్ దిట్ట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అందరి ఊహాగానాలను భిన్నంగా వ్యవహరించి.. గులాబీ శిబిరానికి కూడా కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికలో కేసీఆర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికలో అనూహ్యంగా ఎంపీ బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు. బండా ప్రకాష్ తో పాటు రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించారు. ఈ రోజు నామినేషన్ లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా ఈ రోజే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అందరి ఊహగానాలకు భిన్నంగా బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు.
బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే ఐదుగురి పేర్లు మాత్రమే వినిపించాయి. ఆరో అభ్యర్థి ఎవరా? అనే సందేహం వ్యక్తమవుతున్న సందర్భంలో బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న ప్రకాష్ ను ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత కేసీఆర్ తన కేబినెట్ లోకి చేర్చుకుంటారని గులాబీ నేతలు చెబుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలో మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు చట్ట సభల్లోకి అడుగుపెట్టని కౌశిక్ రెడ్డి, రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డిలో ఈ మండలిలో కూర్చోబోతున్నారు.
ఈటలను కేబినెట్ నుంచి భర్తరప్ చేసిన తర్వాత అదే సమాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్ ను మంత్రిని చేస్తారని చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం చాలా కీలమైనది. ఆ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. అందువల్ల అటు ముదిరాజ్ సామాజికవార్గాన్ని , ఇటు బీసీలను సంతృప్తి పర్చడం కోసం ప్రకాష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలను బయటకు పంపిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఆ ఖాళీని భర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈటలను బయటకు పంపారనే ముద్రను తొలగించుకునేందుకు ప్రకాష్ ను కేబినెట్ లోకి తీసుకుని.. ఆ మచ్చను కేసీఆర్ తుడుపుకోవాలని అనుకుంటున్నారు.
అయితే ప్రకాష్ మండలిలోకి వస్తే ఎంపీ స్థానం ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని మధుసూదనచారితో భర్తీలో చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారుని చెబుతున్నారు. గతంలో మధుసూదనచారి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ఆయనను రాజ్యసభకు పంపితే గౌరవంగా ఉంటుందని, అందువల్ల ఆయనను రాజ్యసభకు పంపుతారని చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇప్పటికే నామినేషన్ ల ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్కో అభ్యర్థికి పదిమంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేశారు. నామినేషనల్ పక్రియ పూర్తి కాగానే అందరూ ఏకగ్రీవమవుతున్నారు.
This post was last modified on %s = human-readable time difference 2:12 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…