Political News

బాబు మాటే నెగ్గుతోందా… వైసీపీ ఇదే మాట అంటోందా…!

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న వారు ఇదే మాట చెబుతున్నారు. ఇక‌, అధికార పార్టీలోనూ ఇదే గుస‌గుస వినిపిస్తోంది. “చంద్ర‌బాబు చెప్పిందే ఫైన‌లా?” అంటూ వైసీపీ నాయ‌కులు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల విష‌యంలో త‌లెత్తిన వివాదం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను విలీనం చేయాల‌నే ప్ర‌తిపాద‌నతో ప్ర‌భుత్వం జీవో 42, జీవో 50ల‌ను తీసుకువ‌చ్చింది. త‌ద్వారా ఆయా విద్యాసంస్థ‌లు.. ప్రైవేటు ప‌రం అవుతాయ‌ని.. దీంతో పేద విద్యార్థులు చ‌దువుల‌కు దూరం అవుతార‌ని.. టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ఇటీవ‌ల అనంత‌పురంలో జ‌రిగిన ఆందోళ‌న ప‌రాకాష్ట‌కు చేరింది. విద్యార్థుల‌పై లాఠీ చార్జీతో ప్ర‌భుత్వంపై మ‌రింత సెగ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఈ అంశంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎయిడెడ్‌పై ఇచ్చిన జీవోలను వెన‌క్కి తీసుకోవాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దేశంలో ఎక్క‌డా ఎయిడెడ్ సంస్థ‌ల‌ను విలీనం చేసుకున్న ప్ర‌భుత్వం లేద‌ని.. ఆయ‌న చెప్పారు.

ఇక‌, రాబోయే రోజుల్లో టీడీపీ ఎయిడెడ్ విద్యార్థుల‌కు అండగా ఉంటుంద‌ని.. వారి ఉద్య‌మానికి మ‌ద్ద‌తిస్తున్నది తెలిపారు. ఈ అంశం.. ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్తోంది. పైగా విద్యావ్య‌వ‌స్థ‌తో కూడుకున్న సున్నిత విష‌యం కావ‌డంతో ప్ర‌జ‌లు కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ వెర్ష‌న్ చూసుకుంటే.. తామేమీ బ‌లవంతం చేయ‌డం లేద‌ని.. విలీనం ప్ర‌తిపాద‌న‌.. కేవ‌లం అంగీక‌రించిన సంస్థ‌ల‌కే వ‌ర్తించ‌నుంద‌ని.. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. చెబుతున్నారు.

అయితే.. ప్ర‌భుత్వ వాద‌న కంటే కూడా ప్ర‌తిప‌క్షం వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంద‌ని.. ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని వివ‌ర‌ణ‌లు ఇచ్చినా.. మంత్రులు కూడా ఈ విష‌యంపై స్పందించినా.. ప్ర‌జ‌ల్లోకి మాత్రం ప్ర‌తిప‌క్ష‌వాద‌నే బ‌లంగా చేరింది. దీంతో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే జ‌రుగుతుందా? ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గాలా? అనే సందేహాలు.. మంత్రుల్లోనే వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం జోక్యం చేసుకుని.. ఇప్ప‌టికైనా మీడియా ముందుకు రావాల‌ని.. ఎయిడెడ్‌పై వివ‌రించాల‌ని వారు కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 13, 2021 8:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…

12 minutes ago

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

2 hours ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

3 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

3 hours ago

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని…

3 hours ago