Political News

కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్న కేంద్రం!

కేంద్రంపై సీఎం కేసీఆర్ యుధ్దాన్నే ప్రకటించారు. శుక్రవారం నుంచి కదన రంగాన్ని సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదేనని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఇక కేంద్రం కూడా కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవాడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రం సీరియస్ గా తీసుకుందని, ఆయనను కట్టడి చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

ధాన్యం కొలుగోలు, కృష్ణా జలాలు ఇలా అనేక అంశాలపై రెండు రోజులు మీడియా సమావేశంలో కేంద్రాన్ని కేసీఆర్ టార్గెట్ చేశారు. ఈ పరిణామాలను కేంద్రం దగ్గర నుంచి పరిశీలించిందని కాషాయపార్టీ వర్గాలు చెబుతున్నారు. కేసీఆర్ లేవనెత్తిన అన్ని అంశాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అధిష్టానానికి సమగ్ర నివేదిక అందించారని చెబుతున్నారు. కేసీఆర్ మాట్లాడింది అన్నీ అబద్ధాలేనని సంజయ్ పంపిన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే సంజయ్ నివేదిక చేరిందో లేదో ఇంతలోనే కేసీఆర్‌ టార్గెట్ గా కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ, తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జరిగిన జాప్యానికి కేసీఆరే కారణమని కేంద్ర షెకావత్‌ ఆరోపించారు. 2015లోనే ట్రైబ్యునల్ కోసం కేసీఆర్, సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం ట్రైబ్యునల్‌ వేయాలని 2015లో సుప్రీంకోర్టులో తెలంగాణ కేసు వేసిందని తెలిపారు. 2020 అక్టోబరు 6వ తేదీన ఆ కేసును రెండురోజుల్లో వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ తనకు చెప్పారని షకావత్ వెల్లడించారు. 8 నెలల తర్వాత కేసును వెనక్కితీసుకున్నారని, ఏడేళ్ల మీ నిర్లక్ష్యానికి కేంద్రం, తాను ఎలా బాధ్యులమవుతాం? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ట్రైబ్యునల్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకునే పరిధి తమకు లేకుండాపోయిందని పేర్కొన్నారు.

కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు పెద్ద ప్రక్రియ కాబట్టి జాప్యాన్ని నివారించడానికి పాత ట్రైబ్యునల్‌కే విధివిధానాలు ఖరారు చేయడానికి తాను మొగ్గుచూపుతున్నాని తెలిపారు. రెండింటిలో ఏది జరిగినా.. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచడంపై మాత్రమే ట్రైబ్యునల్‌ తేల్చుతుందని చెప్పారు. న్యాయశాఖ అభిప్రాయం చెప్పేంతవరకూ ట్రైబ్యునల్‌ ఎప్పట్లోగా ఏర్పాటవుతుందో చెప్పలేమని తేల్చిచెప్పారు. ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే.. బోర్డుల పరిధిని నోటిఫై చేశామన్నారు. ఉభయసభల్లో ఆమోదించిన అంశాలపై కేసీఆర్ ఇష్టానుసారంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నదుల నుంచి ఎవరికి నచ్చినట్లుగా వారు నీటిని వాడుకుంటున్నారని, కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కోసం తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని షెకావత్ వివరించారు.

ఇప్పుడు అకస్మాత్తుగా కేసీఆర్‌ దీన్ని పెద్ద డ్రామాగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారని, ఒక రాష్ట్రానికి సీఎం ఉన్న వ్యక్తి ఇలా అనడం ప్రజాస్వామికమని తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయడంగానే ఆక్షేపించారు. రెండు రాష్ట్రాలూ ఇలా చేస్తేనే బోర్డుల కార్యకలాపాలు సజావుగా సాగుతాయన తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలూ సమర్పిస్తున్న డాక్యుమెంట్లను చూపిస్తాని వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పేరుతో అసలు ప్రాజెక్టే లేదని తెలిపారు. అయినా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే సమయంలో తాము సరైన పేరును పేర్కొన్నామని తెలిపారు. ఇందులో వివాదమేమీ లేదన్నారు. అయితే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రెండువైపులా వాస్తవాలు చూడాలని షెకావత్ సూచించారు.

This post was last modified on November 12, 2021 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

5 minutes ago

పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?

రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…

42 minutes ago

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

3 hours ago

అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

7 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

8 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

10 hours ago