Political News

కుప్పంలో ఓటరైన చంద్రబాబు

అదేమిటి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇఫుడు ఓటరవ్వటం ఏమిటనే సందేహం వచ్చిందా ? అనే సందేహం వచ్చిందా ? అవును మీ సందేహం కరెక్టే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం నగర పంచాయితీకి మున్సిపల్ హోదా దక్కింది కాబట్టి చంద్రబాబు ఇపుడు తన ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కుప్పం మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చంద్రబాబు ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ప్రతి మున్సిపాలిటిలో ఎంఎల్ఏ లేదా ఎంఎల్సీ లేదా ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అందరికీ తెలిసిందే కదా.

ఆ పద్ధతిలోనే చంద్రబాబు ఎంఎల్ఏ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటును నమోదు చేసుకున్నారు. ఇంతకాలం అవసరం రానిది ఇపుడే ఎందుకు ఓటుహక్కు తీసుకున్నారంటే ఇపుడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక జరుగుతుండటమే కారణం. కుప్పం మున్సిపల్ ఎన్నికలో అధికార వైసీపీ-టీడీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న విషయం చూస్తున్నదే. ఫైట్ ఇంత టైట్ గా నడుస్తున్నపుడు ప్రతి ఓటు ఎంతో విలువైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాంటి ఎన్నికలో రేపు మున్సిపాలిటిలో గెలవడానికి టీడీపీకి ఒకవేళ ఒక ఓటు తక్కువైతే అప్పుడు ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకనే ముందుజాగ్రత్తగా చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో ఓటును నమోదు చేసుకున్నారు. 25 వార్డుల మున్సిపాలిటీలో టీడీపీకి మెజారిటీ వస్తే నో ప్రాబ్లెమ్. అలా కాకుండా కేవలం ఒక్క ఓటు తేడా వస్తే ఆ తేడాను తన ఓటుతోనే భర్తీ చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. గడచిన రెండున్నరేళ్ళుగా కుప్పం మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు నమోదు చేసుకోని చంద్రబాబు ఇపుడు హడావుడిగా నమోదు చేసుకోవటం గమనార్హం.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. టీడీపీ బహిష్కరణతో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఇలాంటి నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఎవరు అనుకోవటం లేదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే ముందు జాగ్రత్తగా చంద్రబాబు ఎక్స్ అఫీషియో సభ్యుడయ్యారు. దీని వల్ల రేపటి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బహుశా మొదటిసారి చంద్రబాబు పాల్గొనే అవకాశం వస్తుందేమో చూడాలి.

అయినా ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో క్యాంపేశారు. ఇదే సమయంలో మాజీమంత్రులు, ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు టీడీపీ తరపున కుప్పంలో క్యాంపేశారు. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను గమనిస్తుంటే ఫలితం నువ్వా-నేనా అనే అవసరమైతే రాదనే అనిపిస్తోంది. ఎవరు గెలిచినా క్లియర్ మెజారిటితోనే ఛైర్మన్ పదవిని గెలుచుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. చూడాలి చివరకి ఏమవుతుందో.

This post was last modified on November 10, 2021 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago