Political News

ఈట‌ల‌కు నోటీసులు.. వెంటాడుతున్న కేసీఆర్‌!

రామేశ్వ‌రం వెళ్లినా.. శ‌నేశ్వ‌రం త‌ప్ప‌లేద‌న్న‌ట్టుగా ఉంది.. మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు.. ఈటల రాజేంద‌ర్ ప‌రిస్థితి. గ‌త మే నెల‌లో.. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైందో.. ఇప్పుడు మ‌ళ్లీ అదే రిపీట్ అయింది. తాజాగా.. ఈట‌ల‌కు.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని జ‌మున హ్యాచ‌రీస్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. నిజానికి గ‌తంలోనే మెద‌క్ క‌లెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇవి చెల్ల‌వంటూ.. తెలంగాణ హైకోర్టు చెప్ప‌డంతో.. అప్ప‌టి నుంచి మౌనంగా ఉన్న కేసీఆర్ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రోసారి నోటీసులు జారీ చేయించింది. దీంతో కేసీఆర్‌.. ఈట‌ల‌ను వ‌దిలి పెట్ట‌రా? అనే టాక్ వినిపిస్తోంది.

తన కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కోసం మాజీమంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వ‌చ్చాయి. దీనిపై కొంద‌రు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశార‌ని.. పేర్కొంటూ.. గ‌తంలోనే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది.

అంతేకాదు.. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్ర‌మంలో అప్ప‌టి నుంచి ఈ కేసు విష‌యంలో.. కేసీఆర్ మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప పోరులో ఈట‌ల గెలుపు త‌ర్వాత‌.. వెంట‌నే ఆయ‌న తుట్టెను క‌దిపిన‌ట్టు భావిస్తున్నారు.

ముసాయిపేట‌లోని అసైన్డ్ భూముల‌పై విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ తాజాగా విచార‌ణ‌కు ఆదేశించారు. దీంతో అధికారులు ఈట‌ల రాజేందర్‌కు నోటీసులు అందించారు. అయితే.. ఇది రాజ‌కీయంగా మ‌రోసారి వివాదం అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉండ‌డం. హుజూరాబాద్‌లో ఓడిపోవ‌డం.. బీజేపీ దూకుడు పెర‌గ‌డం.. వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం.. రాజ‌కీయంగా మ‌రింత సెగ‌లు పుట్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

This post was last modified on November 8, 2021 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

1 hour ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago