టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అన్నంతనే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుకు వచ్చే పేరు హరీశ్ రావు. పార్టీకి విధేయుడిగా ఉంటూ.. ఎన్ని అవమానాలకు గురి చేసినా గమ్మున ఉంటూ.. కష్టపడతారన్న పేరు ఆయనకు ఉంది. 2018 ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత దాదాపు ఆర్నెల్లకు పైనే హరీశ్ రావు ఫోటోను కేసీఆర్ సొంత మీడియా సంస్థలో ప్రముఖంగా చూపించకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తుంటారు.
అంతేనా.. మొన్న జరిగిన ప్లీనరీ వేళలో హైదరాబాద్ మొత్తం గులాబీ మయం చేసేలా భారీ ఎత్తున కటౌట్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ హరీశ్ బొమ్మ ఎక్కువ కనిపించలేదు. ఆ మాటకు వస్తే.. ప్లీనరీ సందర్భంగా వివిధ దినపత్రికలకు ఇచ్చిన జాకెట్ యాడ్ మీద హరీశ్ రావు ఫోటోను వేయకపోవటం చూస్తే.. ఆయనకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది చేతలతో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటారని ఆయన సన్నిహితులు ప్రైవేటు సంభాషణల్లో వాపోతుంటారు.
అలాంటి హరీశ్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో.. తనకెంతో ఆప్తుడు.. సన్నిహితుడైన ఈటలను ఉద్దేశించి ఎన్ని మాటలు అన్నారో.. మరెన్ని దారుణ వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. ఇంత కష్టపడిన తర్వాత కూడా హరీశ్ కు ఫలితం దక్కకపోగా.. ఆయనకున్న ట్రబుల్ షూటర్ పేరు మసకబారే పరిస్థితి చోటు చేసుకుంది. ఎందుకంటే.. అప్పట్లో దుబ్బాక.. తాజాగా హుజూరాబాద్. ఈ రెండు ఉప ఎన్నికల బాధ్యతను హరీశ్ కు అప్పజెప్పటం.. అంతా తానై అన్నట్లుగా వ్యవహరించిన హరీశ్ కు వరుస ఎదురుదెబ్బలు తగిలిన పరిస్థితి.
అయితే.. ఈ ఎదురుదెబ్బల వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉన్నారని చెబుతున్నారు. అతడే ఒకప్పుడు టీఆర్ఎస్ నేతగా సుపరిచితుడు.. కాలక్రమంలో బీజేపీలోకి చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిగా చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక వేళ.. బీజేపీకి దన్నుగా నిలిచి.. అంతా తాను చూసుకుంటానని చెప్పిన జితేందర్ రెడ్డి గులాబీ వ్యూహాలకు చెక్ పెట్టేలా ప్రణాళికల్ని రూపొందించినట్లు చెబుతారు.
టీఆర్ఎస్ పార్టీలో ఉండి.. వారి ఆట గురించి బాగా తెలిసిన జితేందర్ కు.. వారి ఎత్తులకు పైఎత్తులు వేసి షాకిచ్చారు. తాజాగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఈటలకు దన్నుగా నిలిచిన ఆయన.. బ్యాక్ ఎండ్ లో భారీగా కష్టపడినట్లుగా చెబుతున్నారు. ఇలా రెండు ఉప ఎన్నికల్లో గులాబీ ట్రబుల్ షూటర్ కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురావటంతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కీలకభూమిక పోషించినట్లుగా చెబుతున్నారు. కాలం కలిసి రాకపోతే.. జితేందర్.. ఈటల రూపంలో గులాబీ బాస్ కు షాకులు ఇస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on November 4, 2021 10:23 pm
సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత…
అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం…
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…